iDreamPost
android-app
ios-app

జింబాబ్వే సిరీస్​కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్!

  • Published Jun 24, 2024 | 6:49 PM Updated Updated Jun 24, 2024 | 6:49 PM

జింబాబ్వే సిరీస్​కు భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. టీమ్​కు కెప్టెన్​గా యంగ్​ బ్యాటర్​కు అవకాశం ఇచ్చారు. అసలు స్క్వాడ్ ఎలా ఉంది? కొత్త సారథి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

జింబాబ్వే సిరీస్​కు భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. టీమ్​కు కెప్టెన్​గా యంగ్​ బ్యాటర్​కు అవకాశం ఇచ్చారు. అసలు స్క్వాడ్ ఎలా ఉంది? కొత్త సారథి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 24, 2024 | 6:49 PMUpdated Jun 24, 2024 | 6:49 PM
జింబాబ్వే సిరీస్​కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్!

టీ20 వరల్డ్ కప్-2024తో ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. ఆటగాళ్ల విన్యాసాలను చూస్తూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం మెగాటోర్నీ తర్వాత జరగాల్సిన సిరీస్​ల గురించి ప్లాన్ చేస్తోంది. ఒకవైపు కొత్త కోచ్ ఎంపిక గురించి కసరత్తులు చేస్తూనే.. వచ్చే ఏడాది కాలంలో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్​ల నిర్వహణ, షెడ్యూల్స్ గురించి ప్లానింగ్ చేస్తోంది. ఇప్పటికే హోమ్ సిరీస్​ల షెడ్యూల్​ను విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా జింబాబ్వే సిరీస్​ గురించి ఇంట్రెస్టింగ్ అప్​డేట్ ఇచ్చింది. ఈ టూర్​కు వెళ్లే భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. 15 మందితో కూడిన టీమ్​ను అనౌన్స్ చేశారు.

జింబాబ్వే టూర్​కు వెళ్లే టీమిండియాకు యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ను కెప్టెన్​గా ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఓపెనర్​గా ఉన్న గిల్​కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును సమర్థంగా నడిపే రెస్పాన్సిబిలిటీని అతడికి ఇచ్చారు. ఈ టీమ్​లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జురెల్, నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, దేశ్​పాండే చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున రచ్చ చేసిన అభిషేక్, నితీష్​కు టీమ్​లో ప్లేస్ దొరకడం హైలైట్ అనే చెప్పాలి. మరి.. జింబాబ్వే టూర్​కు వెళ్లే భారత జట్టులో ఇంకా ఎవరైనా ఉంటే బాగుండేదని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

జింబాబ్వే టూర్​కు వెళ్లే భారత జట్టు:
శుబ్​మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుషార్ దేశ్​పాండే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom