వన్డే వరల్డ్ కప్-2023 ఫస్ట్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ముందే చెన్నైకి చేరుకున్న ఇరు జట్ల ప్లేయర్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. నెట్స్‌లో భారత్-ఆసీస్ ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీని విక్టరీతో మొదలుపెట్టాలనే ఉద్దేశంలో ఉన్న టీమిండియా.. కంగారూలతో తొలిపోరుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవడం కోసం భారత మేనేజ్మెంట్ స్పెషల్ ప్లాన్స్ వేస్తోంది.
చెపాక్ వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా చైనామన్ కుల్దీప్ యాదవ్ కూడా టీమ్‌లో ఉంటాడని టాక్. పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మోస్తారు. వారికి తోడుగా ఎలాగూ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. అయితే అతడి వేలికి గాయమైందనే వార్తల నేపథ్యంలో బౌలింగ్ చేస్తాడో లేదో చూడాలి. ఒకవేళ పాండ్యా బౌలింగ్ వేయకపోతే టీమిండియా తుది కూర్పు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. బ్యాటింగ్ విషయంలో భారత్ కాస్త ఆందోళన పడుతోంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ గిల్ ఆడకపోతే ఇషాన్ కిషన్ అతడి ప్లేసులో గ్రౌండ్లోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదొక్కటి తప్పితే బ్యాటింగ్ విషయంలో ఏ టెన్షన్ లేదు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉండటం బిగ్ ప్లస్. వీళ్లందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్లే. స్పిన్, పేస్‌ను బాగా ఆడగల సమర్థులే. అయితే అయ్యర్ విషయంలో మాత్రం ఒక ఆందోళన ఉంది. స్పిన్‌ను బాగా హ్యాండిల్ చేసే ఈ స్టార్ బ్యాటర్.. పేస్‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడతాడు. అందులోనూ పిచ్‌పై పడి ముఖం మీదకు దూసుకొచ్చే బౌన్సర్లు, బీమర్లను ఫేస్ చేయడంలో అయ్యర్ చాలా వీక్. భారత్‌తో మ్యాచ్ టైమ్‌లో అయ్యర్ బ్యాటింగ్‌కు దిగితే చాలు.. ప్రత్యర్థి బౌలర్లు అతడికి షార్ట్ పిచ్ బంతుల్ని అదేపనిగా వేస్తుంటారు.
శ్రేయస్ అయ్యర్ కూడా చాలామార్లు షార్ట్ పిచ్ బంతులకే ఔటయ్యాడు. కానీ గాయం తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన శ్రేయస్.. బౌన్సర్లను గ్రౌండ్ షాట్స్‌గా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఈ రకమైన బంతుల్ని ఎదుర్కోవడంలో అతడిలో అంత పర్ఫెక్షన్ కనిపించలేదు. ఈ వరల్డ్ కప్‌లో మళ్లీ ఇదే బలహీనతగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే కోచ్ రాహుల్ ద్రవిడ్ దీనిపై ఫోకస్ చేశాడు. నెట్స్‌లో అయ్యర్‌తో పుల్ షాట్ ఆడటం ప్రాక్టీస్ చేయించాడు. టెన్నిస్ బ్యాట్ తీసుకొని అయ్యర్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ద్రవిడ్-అయ్యర్ ప్రాక్టీస్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బౌన్సర్లను అయ్యర్ గట్టిగా లెగ్ సైడ్ వైపు కొడుతూ కనిపించాడు. అయ్యర్ బలహీనతను బలంగా మార్చాలనే ద్రవిడ్ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలేనని ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు.
ఇదీ చదవండి: World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్! భారత్-ఆసీస్ మ్యాచ్ జరగకపోవచ్చు!
Rahul Dravid, with a tennis racquet in hand, firing tennis balls towards Shreyas Iyer from few feet. This is a preferred drill for batters looking to improve their short-ball game and sharpen those reflexes. pic.twitter.com/lKxCOtt2s8
— Pick-up Shot (@96ShreyasIyer) October 7, 2023