iDreamPost

IND vs AUS: ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

  • Author singhj Published - 11:52 AM, Sun - 3 December 23

ఆసీస్​తో ఆఖరి టీ20లో భారత జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

ఆసీస్​తో ఆఖరి టీ20లో భారత జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 11:52 AM, Sun - 3 December 23
IND vs AUS: ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్​ను భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. తద్వారా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్​ చేతిలో ఓటమి నుంచి అభిమానులకు కాస్త ఊరటను అందించింది. టీమ్​లో స్టార్ ప్లేయర్లు లేకున్నా, కీలక ఆటగాళ్లు దూరమైనా.. సూర్యకుమార్ కెప్టెన్సీలో యంగ్ క్రికెటర్లతో కూడిన భారత్ అదరగొడుతోంది. ఇదే ఊపులో ఆదివారం జరిగే ఆఖరి టీ20లోనూ నెగ్గి సిరీస్​ను 4-1తో ముగించాలని చూస్తోంది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా టూర్​కు ముందు మరింత కాన్ఫిడెన్స్​ను కూడగట్టుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పటికే సిరీస్ పోయింది కాబట్టి ఈ మ్యాచ్​లో గెలిచి కాస్త సంతృప్తితో స్వదేశానికి వెళ్లాలని కంగారూ టీమ్ భావిస్తోంది.

సిరీస్ ఎలాగూ గెలిచేశాం కాబట్టి ఈ మ్యాచ్ నామమాత్రమని చెప్పడానికి లేదు. త్వరలో జరగనున్న సౌతాఫ్రికా టూర్​కు ముందు కొందరు ఆటగాళ్లు తమ ఫామ్​ను చాటుకోవాల్సి ఉంది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, పేసర్ దీపక్ చాహర్​ రిథమ్​లోకి రావాల్సి ఉంది. ఏడాది గ్యాప్ తర్వాత ఆసీస్​తో నాలుగో టీ20లో వీళ్లు తిరిగి టీ20 ఫార్మాట్​లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మ్యాచ్​లో టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్​ను ఔట్ చేసినప్పటికీ 44 రన్స్ ఇచ్చుకున్నాడు చాహర్. పవర్​ప్లేలో వికెట్లు తీయలేకపోయిన ఈ స్వింగ్ బౌలర్.. పరుగులు భారీగా ఇచ్చుకున్నాడు. కాబట్టి చివరి టీ20లో అతడు లయను అందుకోవాల్సి ఉంది. మరోవైపు ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ భారత్​కు మంచి స్టార్ట్ అందిస్తున్న యశస్వి జైస్వాల్ పవర్​ప్లేలోనే ఔట్ అవుతున్నాడు.

జైస్వాల్ మరో నాలుగైదు ఓవర్లు క్రీజులో ఉంటే టీమిండియా మరింత భారీ స్కోర్లు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అతడు మరింత పట్టుదలతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. బిష్ణోయ్ అయితే పవర్​ప్లేలోనూ ఎలాంటి బెరుకు లేకుండా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. అయితే టీమిండియా పేస్ యూనిట్ గాడిన పడాల్సి ఉంది. దీపక్​ చాహర్​తో పాటు అవేశ్ ఖాన్, ముకేశ్​ సత్తా చాటాల్సి ఉంది. వీళ్లు వికెట్లు తీస్తున్నా రన్న్ బాగానే ఇచ్చుకుంటున్నారు. కాబట్టి పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్​మెన్​ను మరింత భయపెడితే భారత్​కు తిరుగుండదు.

ఆసీస్​తో ఆఖరి టీ20లో భారత జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఎలాగూ ఆడతారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఆడతారు. మిడిలార్డర్ భారాన్ని జితేష్ శర్మ, రింకూ సింగ్ మోస్తారు. లోయరార్డర్​లో అక్షర్ పటేల్ ఉంటాడు. పేస్ బౌలింగ్ బాధ్యతలను దీపక్ చాహర్, అర్ష్​దీప్ సింగ్, ముకేష్​ కుమార్ పంచుకుంటారు. స్పిన్నర్లుగా అక్షర్​తో పాటు రవి బిష్ణోయ్ ఉన్నాడు. అయితే స్పిన్ ఆల్​రౌండర్​గా అక్షర్​తో పాటు వాషింగ్టన్ సుందర్​కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సుందర్​ను తీసుకోవాలని అనుకుంటే ముకేశ్​ను పక్కన బెట్టొచ్చు. కాబట్టి ఈ మ్యాచ్​లో వీళ్లిద్దరిలో ఏ ఒక్కరో ఆడాల్సి ఉంటుంది. మరి.. ఐదో టీ20లో టీమ్​లో ఇంకా ఎవరికి చోటు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్​దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్/ముకేష్ కుమార్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్.

ఇదీ చదవండి: Salman Butt: విమర్శల ఎఫెక్ట్.. 24 గంటల్లోనే పదవి ఊస్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి