iDreamPost

Salman Butt: విమర్శల ఎఫెక్ట్.. 24 గంటల్లోనే పదవి ఊస్ట్!

  • Author Soma Sekhar Published - 11:07 AM, Sun - 3 December 23

పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఆట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ను చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ నియమించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఆట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ను చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ నియమించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

  • Author Soma Sekhar Published - 11:07 AM, Sun - 3 December 23
Salman Butt: విమర్శల ఎఫెక్ట్.. 24 గంటల్లోనే పదవి ఊస్ట్!

దేశ భవిష్యత్ కు సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ముందూ వెనక ఆలోచించి అడుగు వేయాలి. లేకుంటే ఆ నిర్ణయం కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అదే జరిగింది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఆట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ను చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ సెలెక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్ గా నియమించాడు. దీంతో అతడిపై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన ఆటగాడిని ఎలా సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా నియమిస్తారు? అంటూ విమర్శల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

పాకిస్థాన్ క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ సల్మాన్ భట్ ను పాక్ సెలెక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్ గా నియమించిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని పరిస్థితులు ఎదురు కావడంతో.. 24 గంటలు తిరగక ముందే అతడిని ఆ పదవి నుంచి తొలగించాడు. దానికి ప్రధాన కారణం మ్యాచ్ ఫిక్సర్ ను ఓ దేశ క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా ఎంపిక చేస్తారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాక్ మాజీ క్రికెటర్లు సైతం ఈ ఎంపికపై గుర్రుగా ఉన్నారు. ఈ ఎఫెక్ట్స్ తో పాక్ చీఫ్ సెలెక్టర్ వాహబ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ వాహబ్ మాట్లాడుతూ..”సల్మాన్ భట్ ను ఆ పోస్ట్ కు ఎంపిక చేసిన తర్వాత నాపై విమర్శల వర్షం కురిసింది. అతడి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే నా డెసిషన్ ను వెనక్కి తీసుకున్నాను. ఈ విషయం గురించి సల్మాన్ భట్ తో కూడా మాట్లాడి.. అతడిని తొలగించానని చెప్పాను. కానీ కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయి” అంటూ విలేకరుల సమావేశంలో రియాజ్ పేర్కొన్నాడు. కాగా.. 2010లో పాకిస్థాన్ క్రికెట్ ను స్పాట్ ఫిక్సింగ్ అంశం కుదిపేసింది. ఈ ఫిక్సింగ్ లో సల్మాన్ భట్ పై ఐదేళ్ల నిషేధం విధించడమే కాకుండా 30 నెలల జైలు శిక్ష కూడా అమలు చేశారు. కానీ 7 నెలలకే జైలు నుంచి విడుదల అయ్యాడు భట్. ఆ తర్వాత 2016లో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతడికి మాత్రం పాక్ బోర్డు అవకాశాలు ఇవ్వలేదు. మరి 24 గంటల్లోనే పదవి నుంచి సల్మాన్ భట్ ను తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి