iDreamPost
android-app
ios-app

ఆసీస్​తో ఫస్ట్ టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

  • Author singhj Published - 08:40 AM, Fri - 24 November 23

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను భారత్ విక్టరీతో స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్​లో సూర్య సేన విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను భారత్ విక్టరీతో స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్​లో సూర్య సేన విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 08:40 AM, Fri - 24 November 23
ఆసీస్​తో ఫస్ట్ టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్​లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్​కు అనుకూలంగా ఉన్న పిచ్ మీద ఇరు టీమ్స్ ఆటగాళ్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. అయితే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్​కు తోడుగా ఇషాన్ కిషన్, రింకూ సింగ్ అదరగొట్టడంతో ఈసారి గెలుపు మనదే అయింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కంగారూ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ (110) సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ (53) మంచి ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. భారీ టార్గెట్​తో బరిలోకి దిగిన భారత్​కు స్టార్టింగ్​లోనే షాక్ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ (0) డైమండ్ డకౌట్​గా వెనుదిరిగాడు.

రుతురాజ్ రనౌట్​ కావడంతో అతడి ప్లేసులో వచ్చిన ఇషాన్ (58) తోడుగా యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (80)తో కలసి ఇషాన్ మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. ఆఖర్లో వీళ్లిద్దరూ పెవిలియన్​కు చేరినా మిగిలిన పనిని రింకూ సింగ్ (22) ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. బ్యాటింగ్​కు అనుకూలంగా ఉన్న పిచ్​పై టాస్ నెగ్గడం మన జట్టుకు కలిసొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్​లో డ్యూ (తేమ) ఉండే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు సూర్య. దీంతో ఎంత టార్గెట్ ఉంటుందో ముందే ఓ అంచనాకు వచ్చి.. ఛేజింగ్​లో అందుకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. ఇది బాగా వర్కౌట్ అయింది.

ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి రెండో కారణం బౌలర్లు. వైజాగ్ పిచ్​పై వికెట్లు తీయడానికి ఇరు జట్ల బౌలర్లు చాలా శ్రమించారు. బ్యాటర్లు విజృంభిస్తుండటం, గ్రౌండ్ సైజ్ కాస్త చిన్నగా ఉండటంతో అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొట్టేశారు. దీంతో వారిని ఆపేందుకు బౌలర్లు చెమటోడ్చారు. ఆసీస్​ ఇన్నింగ్స్​లో సెంచరీ బాదిన ఇంగ్లిస్​ను తప్పితే మిగతా బ్యాటర్లను మన బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. డేంజరస్ మ్యాట్ షార్ట్​ను రవి బిష్ణోయ్ స్టార్టింగ్​లోనే వెనక్కి పంపాడు. ఆఖర్లో స్టొయినిస్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్లు క్రీజులో ఉన్నా ఎక్కువ రన్స్ ఇవ్వకుండా కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. ఈ మ్యాచ్​లో మన సక్సెస్​కు మరో కారణం బ్యాటర్లు రాణించడం.

యంగ్ ఓపెనర్ జైస్వాల్ ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు. వచ్చిన బాల్​ను వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. ఉన్నంత సేపు బాగా ఆడాడు జైస్వాల్. ఇషాన్, సూర్యకు తోడు ఆఖర్లో రింకూ రాణించడంతో విజయం ఈజీ అయింది. అంత ఒత్తిడిలోనూ, ఒకవైపు వికెట్లు పడుతున్నా రింకూ కూల్​గా క్రీజులో ఉండి మ్యాచ్​ను ఫినిష్ చేయడం హైలైట్ అనే చెప్పాలి. భారత్ విజయంలో సూర్య కెప్టెన్సీకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. బౌలింగ్ టైమ్​లో బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ కనిపించిన మిస్టర్ 360.. ఆఖరి ఓవర్లలో ఆసీస్ బ్యాటర్లను నిలువరించడంలో సక్సెస్ అయ్యాడు. బ్యాటింగ్​లో తాను ఫియర్​లెస్ గేమ్ ఆడటమే గాక ఇతర బ్యాటర్లతో కూడా అదే అప్రోచ్​తో బ్యాటింగ్ చేయించాడు. ఇది కూడా మన విజయానికో కారణం.

ఫియర్​లెస్ అప్రోచ్ కారణంగానే అంత భారీ స్కోరును కూడా ఛేజ్ చేయగలిగాం. ఈ మ్యాచ్​లో టీమిండియా విజయానికి ఐదో కారణం రింకూ సింగ్ ఇన్నింగ్స్. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో ఆఖర్లో అక్షర్ పటేల్ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాట్స్​మెన్​ రింకూకు స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించి ఔటయ్యారు. దీంతో టీమ్​పై తీవ్ర ఒత్తిడి పడింది. ఆ టైమ్​లో లాస్ట్ బాల్​కు సిక్స్ కొట్టి గెలిపించాడు రింకూ. అంత ప్రెజర్​లోనూ కూల్​గా ఉండి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. మరి.. భారత్ విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్ స్టార్ బ్యాటర్లను వణికించిన టీమిండియా పేసర్! ఆ ఓవర్లో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి