ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో భారత జట్టులో మూడు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో భారత జట్టులో మూడు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లో జరిగిన ఫస్ట్ టీ20లో టీమిండియాను విజయం వరించింది. తిరువనంతపరం వేదికగా నిలిచిన రెండో మ్యాచ్‌లో కంగారూ టీమ్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. మన జట్టు ఫామ్‌ను బట్టి మూడో మ్యాచ్‌లోనూ మనదే విక్టరీ అని అంతా అనుకున్నారు. కానీ వరుస ఓటముల నుంచి కోలుకున్న ఆసీస్ టీమ్ మూడో టీ20లో తమ పట్టుదలతో ఆడి నెగ్గింది. ఆ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. బౌలర్లు కూడా బాగానే రాణించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సునామీ బ్యాటింగ్‌ను మాత్రం అడ్డుకోలేకపోయారు.
వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్‌పై ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌ను గుర్తుచేస్తూ టీమిండియాతో మూడో టీ20లో రెచ్చిపోయాడు మ్యాక్స్‌వెల్. నిల్చున్న చోటు నుంచే సిక్సర్ల మీద సిక్సులు కొడుతూ భారత్ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో పొట్టి సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న మన జట్టు మరో కీలక ఫైట్‌కు రెడీ అయింది. ఈ రెండు టీమ్స్ మధ్య నాలుగో టీ20 ఇవాళే జరగనుంది. ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్లు ఆడి ఇక్కడే సిరీస్‌ను భారత్ గెలుచుకుంటుందా? లేదా ఆఖరి మ్యాచ్‌లోనే రిజల్ట్ తేలుతుందేమో చూడాలి. ఈ మ్యాచ్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
భారత జట్టులో బ్యాటర్లు సూపర్‌ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ జైస్వాల్ నుంచి ఫినిషర్ రింకూ వరకు అందరూ తమ రోల్స్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కానీ బౌలింగే టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. యంగ్ బౌలర్స్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఇటు వికెట్లు తీయడంలోనూ, అటు రన్స్ ఆపడంలోనూ ఫెయిల్ అవుతున్నారు. ఇది మ్యాచ్ ఫలితం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడో టీ20లో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 68 రన్స్ ఇచ్చాడు. అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌కు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అందుబాటులో ఉండటం లేదు. మ్యాక్సీతో పాటు జంపా, స్మిత్ స్వదేశానికి వెళ్లిపోయారు.
నాలుగో మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, పేసర్ దీపక్ చాహర్ టీమిండియాతో చేరారు. వీళ్లిద్దరూ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అయ్యర్ కోసం తిలక్ వర్మ తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందే. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్‌ల్లో ఒకర్నే ఆడించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగే సూచనలు ఉన్నాయి. ఓపెనర్లుగా జైస్వాల్, రుతురాజ్ ఆడతారు. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్, సెకండ్ డౌన్లో అయ్యర్ దిగుతారు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్, రింకూ సింగ్ ఆడతారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ గ్రౌండ్లోకి దిగుతాడు. పేస్ బాధ్యతలను అర్ష్‌దీప్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్‌ల్లో ముగ్గురు పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. మరి.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంకేమైనా మార్పులు ఉంటాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ/అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఇదీ చదవండి: టీమిండియాకి మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారా?
Striking it clean 💥
Well hello @ShreyasIyer15 👋#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/pdwcBfsAUB
— BCCI (@BCCI) December 1, 2023