iDreamPost

టీమిండియాకి మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారా?

టీమిండియా జట్టు వరుస సిరీస్ లతో బిజీగా గడుపుతోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిశాక సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత అఫ్గనిస్తాన్ తో కూడా ద్వైపాక్షిక సిరీస్ ఉంది. ఈ సిరీస్ లలో టీమిండియాకి మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

టీమిండియా జట్టు వరుస సిరీస్ లతో బిజీగా గడుపుతోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిశాక సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత అఫ్గనిస్తాన్ తో కూడా ద్వైపాక్షిక సిరీస్ ఉంది. ఈ సిరీస్ లలో టీమిండియాకి మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

టీమిండియాకి మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారా?

టీమిండియా వరుస సిరీసులతో ఊపిరి సొలపనంత బిజీగా ఉంటోంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగుతోంది. 5 టీ20ల్లో 3 మ్యాచులు పూర్తవగా.. 2-1తో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా.. సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది. ఆ టూర్ కి సంబంధించి ఇప్పటికే మూడు ఫార్మాట్లకు జట్టును కూడా ప్రకటించారు. ఈసారి మూడు జట్లకు ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేశారు. వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు రోహిత్ శర్మాలను కెప్టెన్లుగా ఎంపిక చేశారు. అయితే ఈ టీమ్స్ ప్రకటించిన తర్వాత అందరికీ ఒక అనుమానం వచ్చింది. అదేంటంటే.. టీమిండియా కోసం మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారా?

అలాంటి ప్రశ్న ఎందుకు వచ్చిందంటే.. ఈ సౌతాఫ్రికా సిరీస్ కి ఎంపిక చేసిన మూడు టీమ్స్ లో కేవలం ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే అన్ని జట్లలో ఉన్నారు. వాళ్లు శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్. శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ ని పక్కన పెడితే.. ముఖేష్ కుమార్ మాత్రమే అన్ని జట్లలో రిపీటెడ్ గా ఉన్న బౌలర్. అందుకే ఇప్పుడు ఈ ప్రశ్న అనేది ఉత్పన్నమవుతోంది. టీమిండియా కోసం మరో బుమ్రాని సిద్ధం చేస్తున్నారా అని. అలాంటి అనుమానం రావడంలో తప్పేం లేదు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. అలాగే జట్టులో సీనియర్స్ ఉన్నప్పుడే యువకులను సిద్ధం చేసుకోవాలి. లేదంటే టీమిండియా పరిస్థితి శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మాదిరిగా మారుతుందనే భయం ఇప్పుడు ఫ్యాన్స్ లో కూడా ఉంది.

అలాంటి పరిస్థితులు రాకూడదని ముందే ముఖేష్ కుమార్ ని సిద్ధం చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఈ యంగ్ టాలెంటెండ్ బౌలర్ ని అన్ని ఫార్మాట్లకు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ముఖేష్ ను సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అన్ని ఫార్మాట్లకు సెలక్ట్ చేశారు. ముఖేష్ కచ్చితంగా టీమిండియాలో ఒక స్టార్ బౌలర్ అవుతాడని, అలాగే 3 ఫార్మాట్లకు ముఖేష్ కుమార్ సూట్ అవుతాడనే నమ్మకంతోనే సెలక్టర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి టీమిండియాకి ఇది ఒక శుభసూచకమనే చెప్పాలి. ఇప్పటివరకు ముఖేష్ కుమార్ టీమిండియా తరఫున 1 టెస్టు, 3 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఆడిన ఏకైక టెస్టులో 2 వికెట్లు తీశాడు. అలాగే వన్డే, టీ20 మ్యాచుల్లో నాలుగేసి వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో తొలి 2 మ్యాచులు ఆడిన ముఖేష్.. మూడో మ్యాచ్ కు జట్టుకు దూరమయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. మళ్లీ తిరిగి నాలుగో టీ20కి జట్టుతో కలిశాడు. జట్టు, కెరీర్ పై ముఖేష్ కుమార్ కి ఉన్న కమిట్మెంట్ పై నెట్టింట ప్రశంలు కూడా కురుస్తున్నాయి. డిసెంబర్ 4న గోరఖ్ పూర్ లో ముఖేష్ కుమార్ వివాహ రిసెప్షన్ జరగనుంది. ఆ ఫంక్షన్ కు టీమిండియా నుంచి సీనియర్లు, స్టార్ ప్లేయర్లు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. మరి.. ముఖేష్ కుమార్ మరో బుమ్రా అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి