iDreamPost

ఇండియా తరఫున ఆడుతూ.. ముంబై ఇండియన్స్ కిట్​తో తిలక్ వర్మ బ్యాటింగ్!

  • Author singhj Updated - 01:22 PM, Mon - 11 December 23

భారత్-ఆసీస్ రెండో టీ20లో జరిగిన ఓ ఘటన గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇండియా తరఫున ఆడుతున్న తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కిట్​తో బ్యాటింగ్​కు దిగడం చర్చనీయాంశమైంది.

భారత్-ఆసీస్ రెండో టీ20లో జరిగిన ఓ ఘటన గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇండియా తరఫున ఆడుతున్న తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కిట్​తో బ్యాటింగ్​కు దిగడం చర్చనీయాంశమైంది.

  • Author singhj Updated - 01:22 PM, Mon - 11 December 23
ఇండియా తరఫున ఆడుతూ.. ముంబై ఇండియన్స్ కిట్​తో తిలక్ వర్మ బ్యాటింగ్!

టీ20లు అంటేనే యంగ్​స్టర్స్ గేమ్. ఈ ఫార్మాట్​లో సత్తా చాటాలని తహతహలాడే యువ ఆటగాళ్లు గ్రౌండ్​లోకి దిగి అదరగొడుతుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​లో యువ భారత్ అద్భుతంగా ఆడుతోంది. మన టీమ్​లో సూర్యకుమార్ యాదవ్​, అక్షర్​ పటేల్​ లాంటి ఒకరిద్దర్ని మినహాయిస్తే మిగతా వాళ్లంతా పెద్దగా అనుభవం లేని ప్లేయర్లే. కానీ కంగారూ జట్టులో మాత్రం స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్ లాంటి స్టార్లు ఉన్నారు. వీళ్లకు ఇంటర్నేషనల్ లెవల్లో చాలా ఎక్స్​పీరియెన్స్ ఉంది. అయినా భారత యంగ్​స్టర్స్ ముందు నిలబడలేకపోతోంది ఆసీస్.

విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20 కంగారూలకు అనూహ్యంగా షాక్ ఇచ్చిన టీమిండియా.. తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్​లో ఫుల్ డామినేషన్ చూపించింది. ఈ మ్యాచ్​లో 44 రన్స్ తేడాతో అపోజిషన్ టీమ్​ను చిత్తు చేసింది భారత్. యశస్వి జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిషన్ (52) బ్యాటింగ్​లో మెరుపులు మెరిపించారు. ఆఖర్లో రింకూ సింగ్ (31 నాటౌట్) కూడా అదరగొట్టడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. భారీ స్కోరును ఛేజ్ చేయడంలో తడబడ్డ ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 191 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ టీమ్​లో స్టొయినిస్ (45) టాప్ స్కోరర్. హిట్టర్లు టిమ్ డేవిడ్ (37), వేడ్ (42 నాటౌట్) రాణించినా అప్పటికే మ్యాచ్ ఆసీస్ నుంచి చేజారింది.

కష్టసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్​కు ఓపెనర్లు స్టీవ్ స్మిత్ (19), మాట్ షార్ట్ (19) మంచి స్టార్ ఇచ్చారు. కానీ ఈ జోడీని రవి బిష్ణోయ్ విడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లిస్​ (2)ను కూడా వెంటనే పెవిలియన్​కు పంపాడు. ఆదుకుంటాడనున్న మాక్స్​వెల్ (12) భారీ షాట్​కు ప్రయత్నించి అక్షర్ పటేల్​కు చిక్కాడు. డేవిడ్-స్టొయినిస్ జోడీ బాగా ఆడారు. కానీ ఛేజ్ చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటం, రన్ రేట్ పెరిగిపోతుండటంతో ఒత్తిడిలో భారీ షాట్​కు ప్రయత్నించి వాళ్లిద్దరూ ఔటయ్యారు. చివర్లో కెప్టెన్ వేడ్ సిక్సులతో భయపెట్టినా.. అప్పటికే మ్యాచ్ ఆసీస్ చేజారింది. భారత బౌలర్లు అందరూ సమష్టిగా రాణించారు.

ఈ మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్ టైమ్​లో జరిగిన ఓ ఘటన వైరల్​గా మారింది. ఓపెనర్ రుతురాజ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు తిలక్ వర్మ. అయితే తిలక్ ముంబై ఇండియన్స్​ కిట్​తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఐపీఎల్​లో ముంబైకి ఆడే తిలక్ ఆ టీమ్ కిట్ వేసుకొని బ్యాటింగ్​కు దిగడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కిట్ విషయం ముందే చూసుకోవాలని.. ముంబై కిట్​తో బరిలోకి దిగడం కరెక్ట్ కాదంటున్నారు. ముంబై టీమ్ ఐపీఎల్​కే పరిమితం అని.. ఇలా దేశం తరఫున ఆడుతున్నప్పుడు వాటిని వేసుకొని ఆడటం సరికాదని చెబుతున్నారు. అయితే అసలు తిలక్ ఎందుకు ముంబై కిట్​తో బ్యాటింగ్ చేశాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి.. ముంబై కిట్​తో తిలక్ బ్యాటింగ్ చేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇన్నేళ్లలో ఆస్ట్రేలియాపై ఇదే ఫస్ట్ టైమ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి