iDreamPost

చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇన్నేళ్లలో ఆస్ట్రేలియాపై ఇదే ఫస్ట్ టైమ్!

  • Author singhj Updated - 01:08 PM, Fri - 8 December 23

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ద్వారా పలు పాత రికార్డులను టీమిండియా బ్రేక్ చేసింది.

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ద్వారా పలు పాత రికార్డులను టీమిండియా బ్రేక్ చేసింది.

  • Author singhj Updated - 01:08 PM, Fri - 8 December 23
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇన్నేళ్లలో ఆస్ట్రేలియాపై ఇదే ఫస్ట్ టైమ్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​లో భారత యంగ్ టీమ్ అదే జోరును కొనసాగిస్తోంది. మొదటి మ్యాచ్​లో కంగారూలకు అనూహ్యంగా షాకిచ్చిన టీమిండియా.. రెండో మ్యాచ్​లో అన్ని విభాగాల్లోనూ అపోజిషన్​ టీమ్​పై డామినేషన్ చూపించింది. తిరువనంతపురంలోని గ్రీన్​ఫీల్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మన టీమ్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటర్లు, ఆ తర్వాత బౌలర్లు, ఫీల్డర్లు రాణించడంతో ఈ మ్యాచ్​లో భారత్​కు తిరుగులేకుండా పోయింది. ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన మన టీమ్​కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (58), యశస్వి జైస్వాల్ (53) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ 5 ఓవర్లు ముగిసేసరికే స్కోరు బోర్డు మీద 70కి పైగా పరుగుల్ని జోడించింది.

వేగంగా ఆడే క్రమంలో జైస్వాల్ ఔటైనా తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (52) తోడుగా ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు రుతురాజ్. వీళ్లిద్దరూ సెకండ్ వికెట్​కు 87 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19), రింకూ సింగ్ (31) కూడా రాణించడంతో జట్టు ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్​కు మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్ (19), మాట్ షార్ట్ (19) వేగంగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే మూడు బౌండరీలు కొట్టి ఊపు మీదున్న షార్ట్​ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్ హీరో జోష్ ఇంగ్లిస్ (2)ను కూడా వెనక్కి పంపాడు బిష్ణోయ్.

గ్లెన్ మ్యాక్స్​వెల్ (12)తో కలసి ఇన్నింగ్స్​ను బిల్డ్ చేద్దామని స్మిత్ ప్రయత్నించాడు. కానీ వీళ్లిద్దరూ తక్కువ గ్యాప్​లోనే పెవిలియన్​కు చేరుకున్నారు. దీంతో బాధ్యత మొత్తం టిమ్ డేవిడ్ (37), మార్కస్ స్టొయినిస్ (45) మీద పడింది. ఈ జోడీ సవాల్​ను స్వీకరిస్తూ బాగా బ్యాటింగ్ చేశారు. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో భయపెట్టారు. అయితే డేంజరస్​గా మారిన డేవిడ్-స్టొయినిస్ జోడీని ముకేష్ కుమార్ విడదీశాడు. ఆ తర్వాత డేవిడ్​ను బిష్ణోయ్ దొరకబుచ్చుకున్నాడు. చివర్లో మాథ్యూ వేడ్ (42) హిట్టింగ్​కు దిగినా అప్పటికే అందుకోవాల్సిన రన్ రేట్ భారీగా ఉండటంతో లాభం లేకపోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్​కు చెరో 3 వికెట్ల దక్కాయి. అక్షర్ పటేల్, అర్ష్​దీప్ సింగ్, ముకేష్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కొత్త కెప్టెన్ సూర్యకుమార్ బౌలింగ్, ఫీల్డింగ్​లో చేసిన ఛేంజెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక, ఈ మ్యాచ్​తో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 235 రన్స్ చేసిన భారత్.. ఆసీస్​పై టీ20ల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేసింది. గతంలో కంగారూ టీమ్ మీద టీమిండియా అత్యధిక స్కోరు 208గా ఉంది. తాజా మ్యాచ్​తో ఆ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తంగా ఆసీస్​పై ఐదుసార్లు 200 ప్లస్ స్కోర్లు చేసింది భారత్. మరో హైలైట్ ఏంటంటే.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ 12 టీ20 మ్యాచ్​లు ఆడింది. వీటిల్లో ఫస్ట్ టైమ్ మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గింది. మరి.. వరుసగా రెండో టీ20లో ఆసీస్​ను భారత్ చిత్తు చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమిపై రాయుడు షాకింగ్ కామెంట్స్.. మూర్ఖత్వం అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి