వన్డే వరల్డ్ కప్ మొదలవ్వడానికి ఇంకొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాయి. భారత్ కూడా తమ ఫైనల్ ఎలెవన్‌పై ఓ అంచనాకు వచ్చేసింది. కొన్ని వారాలకు ముందు వరకు మన జట్టు కూర్పుపై పలు సందేహాలు ఉండేవి. కానీ రీసెంట్గా ముగిసిన ఆసియా కప్‌లో భారత్‌కు ఎన్నో సమాధానాలు లభించాయి. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మతో పాటు ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తమ ఫామ్‌ను చాటుకున్నారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. జడేజా బౌలింగ్ బాగున్నా బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది.
అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న ఈ ఆల్‌రౌండర్ వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి. షమి, సిరాజ్, బుమ్రాలతో కూడిన పేస్ అటాక్ భీకర ఫామ్‌లో ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు వణుకుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ఉన్న ఆందోళనలు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రాణించడంతో తొలగిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి గాయం తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న శ్రేయాస్ అయ్యర్ మీదే ఉన్నాయి. ఆసీస్‌తో ఫస్ట్ వన్డేలో దురదృష్టవశాత్తూ అతడు రనౌట్ అయ్యాడు. కానీ రెండో వన్డేలో మాత్రం అదరగొట్టాడు.
ఆసీస్‌తో రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు శ్రేయాస్ అయ్యర్ (105). ఇది అతడి కెరీర్లో మూడో శతకం కావడం విశేషం. టీమ్‌లో ప్లేస్ కాపాడుకోవాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో అయ్యర్ అదరగొట్టాడు. 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని సత్తా చాటాడు. అయితే సెంచరీ తర్వాత మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయ్యర్‌తో పాటు ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (97 బంతుల్లో 104) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రస్తుతం 37 ఓవర్లకు 271/3తో ఉంది. కేఎల్ రాహుల్ (36 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
The roar from Shreyas Iyer after reaching his century.
The last few months have been tough for Iyer, but he came back like a champion! pic.twitter.com/AsiUK7rG29
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023