iDreamPost

ఈ ఫోటోలో చిన్నారి.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. ఎవరంటే..?

ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తు పట్టారా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన కమ్ నటి. హీరోయిన్ గా అల్రెడీ ప్రూవ్డ్ అయినప్పటికీ.. మంచి కథలతో, క్యారెక్టరైజేషన్ తో దూసుకెళుతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తు పట్టారా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన కమ్ నటి. హీరోయిన్ గా అల్రెడీ ప్రూవ్డ్ అయినప్పటికీ.. మంచి కథలతో, క్యారెక్టరైజేషన్ తో దూసుకెళుతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో చిన్నారి.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. ఎవరంటే..?

హీరోయిన్స్ అనగానే.. హీరోలతో లవ్ అండ్ రొమాన్స్.. నాలుగు నుండి ఆరు పాటల్లో అతడితో పాటు డ్యాన్సులు చేయడం, అర కొర సన్నివేశాల్లో కనిపించడం కాదూ అని నిరూపిస్తున్నారు నేటి భామలు. గుర్తింపు లేని పాత్రలకు చెల్లు చీటి ఇచ్చేస్తున్నారు. కథల ఎంపికతో పాటు క్యారెక్టరైజేషన్ ఉంటేనే ఆ సినిమాలకు సైన్స్ చేస్తున్నారు. పాటలు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రాధాన్యత లేని రోల్స్  వద్దంటున్నారు. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో ఛేంజెస్ చోటుచేసుకుంటున్నాయి. హీరోయిన్ల చుట్టూ తిరిగే కథలను తెరకెక్కించడమే కాదూ.. స్త్రీ పాత్రలను హైలెట్ చేసేవిధంగా చిత్రాలను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఓ నటి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ నటి చిన్న నాటి ఫోటో ఇది. ఇంతకు ఆమె ఎవరో గుర్తు పట్టారా. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లేటుగా అడుగుపెట్టినప్పటికీ..లేటెస్ట్‌గా దూసుకెళుతుంది. ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ.. విస్మయానికి గురి చేస్తోంది. బ్యాగ్రౌండ్ పెద్దదే అయినా..అవకాశాల కోసం ఎదురు చూసే రకం అంతకన్నా కాదూ. కానీ తన వద్దకు వచ్చిన సినిమాలకు సెంట్ పర్సంట్ కన్నా ఎక్కువ అవుట్ పుట్ ఇస్తోంది ఈ భామ. ఇంతకు ఆమె ఎవరో గెస్ చేశారా. ఆ నటి వర్సటైల్ యాక్టర్స్ వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ అంటే..హీరోలతో జతకట్టాలని గిరిగీసు కూర్చొనే రకం కాదూ ఈవిడ. వారికే పోటీ ఇచ్చే గట్స్ కలిగిన నటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెర పై లేడి విలనిజం పండించడంలో ఆమెకు ఆమే సాటి. సౌత్ ఇండస్ట్రీ బిజియెస్ట్ హీరోయిన్  బహుశా ఈమెనేమో

తెనాలి రామకృష్ణ, క్రాక్, యశోద, వీర సింహ రెడ్డి ఇవి చాలు ఈ నటి ఏంటో చెప్పేందుకు. చిన్నవా, పెద్దవా క్యారెక్టర్స్ అని చూడదు.. తనకు నచ్చితే.. క్యామియో రోల్‌కు కూడా ఓకే చెబుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా, మరో నటి రాధికకు సన్నిహితురాలు అయినప్పటికీ.. తన యాక్టింగ్ స్కిల్క్‌తోనే వరుస అవకాశాలు అందుకుంటూ ఉంటుంది. చూసేందుకు చాలా యాటిట్యూడ్ పర్సన్ అనిపిస్తున్నప్పటికీ.. కానీ ఆమె కాన్ఫిడెంట్ లెవల్.. ఆమెను ఎడ్జ్ పై కూర్చొబెట్టేలా చేశాయి. తమిళ్ ఇండస్ట్రీని నుండి అటు మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. టీటౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆమెకు ఏడేళ్ల కాలం పట్టింది.

టాలీవుడ్‌లోకి వస్తున్నామంటే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఈ బ్యూటీ విలనీగా వచ్చింది. బొద్దుగా ఉన్నావన్నా విమర్శలను తట్టుకుని తనను తాను నిరూపించుకుంది. క్రాక్‌లో జయమ్మ పాత్ర చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఎవర్రా బాబు ఇంత బాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నారంతా. నాందిలో హీరో కన్నా ఆమె క్యారెక్టర్ కే ఎలివేషన్ ఎక్కువ. యశోదలో మరో కోణం కనిపిస్తుంది. అలాగే వీర సింహా రెడ్డి ‘సిగ్గుందా’ అన్న ఒక్క డైలాగ్.. దడ పుట్టించింది. కోట బొమ్మాళి ఐపీఎస్, ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్‌లో మంచి రోల్ చేసింది. హీరోకు అక్కగా కనిపించింది. హీరోయిన్ అనే పాత్రకు కొత్త అర్ధాలు చెబుతుంది. పెళ్లి మీద కూడ బోల్డ్ కామెంట్స్ చేసి.. ఇప్పటి అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి