iDreamPost

Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షాలు

  • Published Apr 20, 2024 | 9:12 AMUpdated Apr 20, 2024 | 9:12 AM

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆ వివరాలు..

  • Published Apr 20, 2024 | 9:12 AMUpdated Apr 20, 2024 | 9:12 AM
Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షాలు

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతారణం మారింది. నిన్నటి వరకు మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాగా.. శుక్రవారం సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచాయి. పైగా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచే అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చిక్కడపల్లి, హిమాయత్ నగర్, అబిడ్స్, బర్కత్‌పురా, కార్వాన్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, రాజేంద్రనగర్‌, తుర్కయంజాల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, శంషాబాద్‌, ఆదిబట్ల, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, కాచిగూడ, జల్‌పల్లిలో భారీ వర్షం కురుస్తుంది. వాన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా.. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే వెల్లడించింది.

Heavy rain in Hyderabad

ఇక శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. దాంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇక శుక్రవారం సాయంత్రం చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది.

ఇక ఎండులు మండుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లవద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి