iDreamPost
android-app
ios-app

విడాకులు తీసుకోబోతున్న నాగార్జున హీరోయిన్..!

  • Published Dec 29, 2023 | 3:03 PM Updated Updated Dec 29, 2023 | 4:42 PM

Isha Koppikar: ఇటీవల కాలంలో సెలబ్రిటీ పెళ్లిళ్లు ఎంత ఆనందాన్ని పంచుకుతున్నాయో.. విడాకులు కూడా అంతే బాధను మిగుల్చుతున్నాయి. నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మరో బ్యూటీ ఈ బంధానికి స్వస్థి పలకబోతుందని తెలుస్తోంది.

Isha Koppikar: ఇటీవల కాలంలో సెలబ్రిటీ పెళ్లిళ్లు ఎంత ఆనందాన్ని పంచుకుతున్నాయో.. విడాకులు కూడా అంతే బాధను మిగుల్చుతున్నాయి. నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మరో బ్యూటీ ఈ బంధానికి స్వస్థి పలకబోతుందని తెలుస్తోంది.

  • Published Dec 29, 2023 | 3:03 PMUpdated Dec 29, 2023 | 4:42 PM
విడాకులు తీసుకోబోతున్న నాగార్జున హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో ఊహించడం కష్టం. అలాగే ఏ వివాహ బంధం ఎప్పుడు తెగిపోతుందో చెప్పడం కూడా కష్టమే. ఇటీవల కాలంలో కొన్ని జంటలు విడిపోయి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇప్పటికీ సమంత-నాగ చైతన్య డివోర్స్ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అలాగే ధనుష్-ఐశ్వర్యల వైవాహిక బంధం కూడా బీటలు వారింది. ఇప్పుడు ప్రముఖ అందాల నటి ఐశ్వర్యరాయ్ సైతం.. మామ అమితాబ్ బచ్చన్ ఇంటి నుండి వెళ్లిపోయిందన్న వార్త గుప్పుమంది. అలాగే మెగా వారసురాలు, నటి నిహారిక సైతం భర్త చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి తన వైవాహిక బంధానికి స్వస్థి పలికిందట.

నాగార్జున హీరోయిన్.. భర్త నుండి వేరు పడిందట.  నటి ఇషా కొప్పికర్, తన భర్త హోటల్ వ్యాపారి టిమ్మి నారంగ్ నుండి విడాకులు తీసుకున్నారని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. 14 ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్థి పలికినట్లు తెలుస్తోంది. తన తొమ్మిదేళ్ల కుమార్తె రియానాతో కలిసి తన అత్త ఇంటి నుండి వెళ్లిపోయిందని సమాచారం. అయితే ఈ విషయంపై ఆమెతో మాట్లాడితే.. ‘నేను చెప్పడానికి ఏం లేదు. త్వరగా ముగిసిపోయింది. ఇప్పుడు నాకు ప్రైవసీ అవసరం’అంటూ సమాధానం వచ్చింది. ఇషా, టిమ్మి 2009లో నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. జిమ్‌లో కలుకున్న తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట.. ఆ తర్వాత చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు.

isha koppikar break up with her husnad

వీరికి 2014లో రియానా పుట్టింది. ఇక ఇషా కొప్పికర్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ భాషల్లో నటించింది. ముంబయిలో పుట్టినప్పటికీ.. ఆమె తెరగేట్రం జరిగింది మాత్రం తెలుగు ఇండస్ట్రీతోనే. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ఓ సాంగ్‌లో మెరిసిన అమ్మడు.. చంద్ర లేఖలో నాగార్జున సరసన నటించింది. ఆ తర్వాత తమిళంలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వెంకటేష్‌తో కలిసి ప్రేమతో రా చిత్రంలో నటించినప్పటికీ.. ఆమెకు తెలుగులో మంచి పేరు తీసుకురాలేకపోయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసింది భామ. టాప్ నటిగా ఎదిగింది. మళ్లీ తెలుగులో కేశవ అనే మూవీలో మెరిసింది. ఇప్పుడు అనేక సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సమయంలో ఆమె విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంటున్న ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş