• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Imdb Most Popular Indian Stars Of 2022 Heres All About Who Made It Including Dhanush Alia Bhatt Aishwarya Rai Bachchan Ram Charan Samantha Ruth Prabhu Ntr Jr Allu Arjun And Yash

IMDb Most Popular Indian stars of 2022 :IMDB టాప్ స్టార్స్ ఆధిపత్యం మనదే

  • By idream media Published Date - 04:55 PM, Wed - 7 December 22 IST
IMDb Most Popular Indian stars of 2022 :IMDB టాప్ స్టార్స్ ఆధిపత్యం మనదే

ప్రపంచ సినిమాలకు ప్రామాణికంగా భావించే ఐఎండిబి రేటింగ్స్ కి ఆడియన్స్ ఎంత విలువిస్తారో తెలిసిందే. దర్శక నిర్మాతలు సైతం అందులో వచ్చే నెంబర్ ని తమ ప్రమోషన్ల కోసం వాడుకోవడం చాలా సార్లు చూసాం. తాజాగా ఆ సైట్ నుంచి టాప్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ అఫ్ 2022 లిస్టు విడుదలయ్యింది. అందులో మన టాలీవుడ్ నుంచి ముగ్గురు ఉండటం విశేషం. అవేంటో చూద్దాం. మొదటి స్థానంలో ధనుష్ ఉన్నాడు. మారన్, నేనే వస్తున్నా, నెట్ ఫ్లిక్స్ గ్రే మ్యాన్, తిరులో నటనకు గాను సింహాసనం దక్కింది. సెకండ్ ప్లేస్ అలియా భట్ కు దక్కింది. బ్రహ్మాస్త్ర, గంగూబాయి, డార్లింగ్స్, ఆర్ఆర్ఆర్ విజయాలతో తన గ్రాఫ్ మాములుగా లేదు

అనూహ్యంగా ఐశ్వర్య రాయ్ కి పొన్నియన్ సెల్వన్ 1కు గాను ఈ జాబితాలో చోటు దక్కడం ట్విస్టు. ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అయిన రామ్ చరణ్ మీద ఆచార్య డిజాస్టర్ ప్రభావం పడలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమంతా అయిదో ప్లేస్ ని తీసుకుంది. చేసింది విక్రమ్ వేదా ఒకటే అయినా హృతిక్ రోషన్ మరోసారి జట్టు కట్టాడు. కియారా అద్వానీ సెవెంత్ ప్లేస్ లో ఉంది . భూల్ భూలయ్యా 2 బ్లాక్ బస్టర్, జగ్ జగ్ జియో విజయాలు తన ఖాతాలో ఉన్నాయి. కొమరం భీం గా అదరగొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎనిమిది, పుష్ప 1తో రష్యా దక్కా వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తొమ్మిది ప్లేసులు దక్కాయి

కెజిఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ అయినా అంతర్జాతీయంగా ఎక్కువ రీచ్ చేరకపోవడంతో యష్ టెన్ తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐఎండిబి లిస్టులో మన సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం ఏడుగురు తమిళ తెలుగు ప్రతినిధులు కావడం గమనార్హం. ఇప్పటికే మన సక్సెస్ చూడలేక రగిపోతున్న బాలీవుడ్ బ్యాచ్ కి ఇప్పుడీ ప్రకటన గాయం మీద కారం చల్లినట్టే. రాబోయే రోజుల్లో మన ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. కార్తికేయ 2 లాంటి సినిమాలతో నిఖిల్ లాంటి చిన్న హీరోలు సైతం గుర్తింపు తెచ్చుకుంటున్న ట్రెండ్ లో హిందీ పరిశ్రమ స్థానం మన తర్వాతే ఉంటూ మనల్నే అనుసరించే రోజులు దగ్గరలో ఉన్నాయి

Tags  

  • Allu Arjun
  • dhanush
  • IMDb Most Popular Indian stars of 2022
  • NTR Jr
  • Ram Charan
  • samantha ruth prabhu
  • Yash

Related News

దారుణంగా మారిపోయిన చరణ్ హీరోయిన్! ఎవరంటే?

దారుణంగా మారిపోయిన చరణ్ హీరోయిన్! ఎవరంటే?

తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే మెరిసి.. ఇక్కడి ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిన నటి ఎమీ జాక్సన్. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా పలకరించినప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం ఒకే ఒక్క సినిమా చేసింది. రామ్ చరణ్ నటించిన ఎవడులో ఆమె కనిపించింది. ఆ సినిమాలో తెరపై కనిపించే నిడివి కూడా తక్కువే. అయినప్పటికీ.. ఆ సినిమాతో టాలీవుడ్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. మదరాసు పట్టణం ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్రిటీష్ సుందరి.. ఎక్కువ కోలీవుడ్ […]

6 hours ago
ప్రభాస్, మహేష్ ల తర్వాత బన్నీకే ఆ గౌరవం!

ప్రభాస్, మహేష్ ల తర్వాత బన్నీకే ఆ గౌరవం!

2 days ago
అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన విజయ్! ఏ విషయంలో అంటే?

అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన విజయ్! ఏ విషయంలో అంటే?

3 days ago
‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ పై దిల్ రాజు సీరియస్.. వారిపై క్రిమినల్ కేసు!

‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ పై దిల్ రాజు సీరియస్.. వారిపై క్రిమినల్ కేసు!

5 days ago
ట్వీట్స్ చూసే అర్ధం చేసుకోవాల్సింది.. వీళ్ల సంఖ్య మారుతుందని!

ట్వీట్స్ చూసే అర్ధం చేసుకోవాల్సింది.. వీళ్ల సంఖ్య మారుతుందని!

5 days ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    2 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    2 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    2 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    2 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    3 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    3 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    3 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    4 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    4 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    4 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    4 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    5 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    5 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    5 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version