iDreamPost

Rains in AP: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారే మార్పులు సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తమిళనాడు, కేరళాతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపిస్తుందని ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారే మార్పులు సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తమిళనాడు, కేరళాతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపిస్తుందని ఐఎండీ తెలిపింది.

Rains in AP: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో  భారీ వర్షాలు!

అరేబియా, బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలపై చూపించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చల్లని గాలులు విపరీతంగా వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ, ఏపీలో ఆదివారం నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వర్షాలు,  గాలుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..

బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తమిళనాడులోని   మైలాడుతురై, చెంగల్పట్లు, కడలూరు, తిరువారూర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతున్నాయి. ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండటంతో తమిళనాడుకు సరిహద్దులో ఉన్న రాయలసీమ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మేగావృతమైంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ద్రోని ప్రభావం వల్ల మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అలాగే ప్రకాశం, బాపట్ల, కర్పూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలు కూరిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిసింది. రెండు నెలల క్రితం మిచౌంగ్ తుఫాన్ తో ఏపీ ప్రజలు అల్లల్లాడిపోయారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఇంకా కోలుకోలేదు.. మళ్లి వర్షాలు పడటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

alert for ap peoples

ఏపీలో పలు జిల్లాలో ఆకాశమంతా మేఘావృతం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చల్లని గాలులు వీస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. తిరుమలలో కొండపై సోమవారం వర్షం దంచికొట్టింది.. దీంతో ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీనికి తోడు విపరీతమైన చలి గాలులు వీయడంతో భక్తులు, పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొండపైకి వచ్చే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు.. మంచు పొగలు కప్పడంతో ఉదయం కూడా లైట్లు వేసుకొని మరీ ప్రయాణించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో కూడా వాతావరణ మార్పులు సంభవించాయి. బంగాళాఖాతంలో ఇవాళ గంటకు సుమారు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి