iDreamPost

మీరు గనుక ఇలా చేస్తే మీ దంతాలు త్వరగా పాడవుతాయి.. దంతాలు బాగుండాలంటే??

మీరు గనుక ఇలా చేస్తే మీ దంతాలు త్వరగా పాడవుతాయి.. దంతాలు బాగుండాలంటే??

చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఈమధ్యకాలంలో చాలామందికి తొందరగా దంతాలు పాడవుతున్నాయి. దంతాలలో నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా తీపి పదార్థాలు స్వీట్స్, చాకోలెట్స్, పంచదార వంటివి తింటే దంతాలు పుచ్చిపోతాయి. మనం ఆహారం తిన్న తరువాత నోటిని పుక్కిలించాలి, దీనివల్ల పళ్ళ మధ్యలో ఇరికిన ఆహార పదార్థాలు బయటకు వస్తాయి లేకపోతే ఇవి దంతాల మధ్యలో ఉండి దంతాలు పాడయ్యేలా చేస్తాయి.

పాతకాలంలో అందరూ కూడా వేపపుల్లలతో పళ్ళు తోముకునేవారు ఇప్పుడు అందరూ బ్రష్, పేస్ట్ వాడుతున్నారు. వేపలో ఉండే యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి ప్రస్తుత కాలంలో వేపపుల్లలు దొరికేవారు ఎప్పుడైనా వేపపుల్లలతో నోటిని కడుక్కోండి లేకపోతే బయట దొరికే వేపరసాన్ని ఉపయోగించి నోటిని శుభ్రం చేసుకోండి. దీనివల్ల పళ్లలో వచ్చే క్యావిటీ తగ్గుతుంది.

ఎక్కువగా పళ్ళపై బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ పోతుంది. దీనివల్ల పళ్ళు సెన్సిటివ్ గా మారి చల్లని, వేడి పదార్థాలు తిన్నప్పుడు పంటి నొప్పిని కలిగిస్తాయి. ఎవరికైనా పంటి నొప్పి ఉంటే వారు రోజూ భోజనం తిన్న తరువాత నోటిని క్లీన్ చేసుకున్నాక ఒక లవంగం తింటే మంచిది. ఇలా తినడం వల్ల పంటి నొప్పిని తగ్గిస్తుంది. పంటి నొప్పి తగ్గడానికి పచ్చి ఉల్లిపాయను కూడా తినొచ్చు. కాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకున్నా దంతాలు గట్టిగా, పాడవకుండా ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి