iDreamPost
android-app
ios-app

బౌలింగ్​లో రెచ్చిపోతున్న టీమిండియా.. భారత బౌలర్ల సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..!

  • Author singhj Published - 05:28 PM, Mon - 30 October 23

ఈ వరల్డ్ కప్​లో భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. మన బౌలర్లను ఫేస్ చేయాలంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతున్నారు. భారత్​తో మ్యాచ్​లో వికెట్లను కాపాడుకుంటూ రన్స్ చేయడమో ఛాలెంజ్​గా మారింది.

ఈ వరల్డ్ కప్​లో భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. మన బౌలర్లను ఫేస్ చేయాలంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతున్నారు. భారత్​తో మ్యాచ్​లో వికెట్లను కాపాడుకుంటూ రన్స్ చేయడమో ఛాలెంజ్​గా మారింది.

  • Author singhj Published - 05:28 PM, Mon - 30 October 23
బౌలింగ్​లో రెచ్చిపోతున్న టీమిండియా.. భారత బౌలర్ల సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..!

వన్డే వరల్డ్ కప్-2023 టీమిండియా హవా కొనసాగుతోంది. విజయాల్లో డబుల్ హ్యాటిక్ కొట్టింది రోహిత్ సేన. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తోంది భారత్. ఒక్కో ఛాలెంజ్​ను అధిగమిస్తూ ప్రపంచ కప్ సాధించే దిశగా మన టీమ్ జర్నీ సాగుతోంది. అయితే ఈ ఆరు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్​తో మ్యాచ్​ టీమిండియాకు మరీ స్పెషల్. ఎందుకంటే ఈ మ్యాచ్​లో మన బౌలర్ల టార్గెట్ నేరుగా స్టంప్స్ మీదే ఉండటం విశేషం. ఇండియన్ బౌలింగ్ యూనిట్ ఎంత డేంజరస్ అనేది మరోసారి అందరికీ తెలిసొచ్చింది. ఈ టోర్నమెంట్​లో మహామహులైన బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు.

ఎంతటి బ్యాటర్ అయినా టీమిండియా బౌలర్ల ముందు వాళ్ల పప్పులు ఉడకడం లేదు. పిచ్, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు గత ఐదు మ్యాచుల్లో బౌలింగ్ చేసి ప్రత్యర్థులను కట్టడి చేశారు భారత బౌలర్లు. ఆ తర్వాత బ్యాటింగ్ యూనిట్ చెలరేగడంతో విజయాలు దక్కాయి. కానీ ఇంగ్లండ్​తో మ్యాచ్​లో మాత్రం మనదే ఫస్ట్ బ్యాటింగ్. టార్గెట్ 230 మాత్రమే ఉండటంతో డిఫెండ్ చేయగలమా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అవతల ఇంగ్లీష్ టీమ్​లో లోయరార్డర్ వరకు అందరూ మంచి బ్యాటర్లే. కానీ భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్​కు కట్టుబడి బాల్స్​ను వేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆ టీమ్ కేవలం 129 రన్స్​కే కుప్పకూలింది.

ఇంగ్లండ్​ ఇన్నింగ్స్​లో మొత్తం 10 వికెట్లలో ఏడు పేసర్లు తీయగా.. మూడు స్పిన్నర్లకు దక్కాయి. అయితే ఇందులో ఆరుగుగు బ్యాటర్లు బౌల్డ్ కావడం విశేషం. ఇద్దరు ఎల్బీ, ఒక క్యాచ్, ఒక స్టంపౌట్ అయ్యారు. దీన్ని బట్టే టీమిండియా బౌలింగ్ యూనిట్ పదును ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెన్​ స్టోక్స్​ను షమి బౌల్డ్ చేయగా.. బట్లర్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు కుల్దీప్. డేవిడ్ మలన్​ను బుమ్రా బౌల్డ్ చేసిన తీరు కూడా సూపర్బ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్​లోనే కాదు మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ మన బౌలర్లు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశారు. అందుకే ఎక్కువ మంది ప్రత్యర్థి బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.

పాకిస్థాన్​తో మ్యాచ్​లో ఆ టీమ్ కెప్టెన్​ బాబర్ ఆజంను సిరాజ్ బౌల్డ్ చేశాడు. స్టార్ బ్యాటర్ రిజ్వాన్​ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో గ్లెన్ మ్యాక్స్​వెల్​ కుల్దీప్ బౌలింగ్​లో బౌల్డ్ అయ్యాడు. ఇలా ప్రతి మ్యాచ్​లోనూ స్వింగ్, స్పిన్ డెలివరీస్ వేస్తూనే.. సాధ్యమైనంతగా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​తో స్టంప్స్​ను టార్గెట్ చేస్తున్నారు భారత బౌలర్లు. ఈ ప్లాన్ బాగా వర్కవుటై వికెట్లు పడుతున్నాయి. ఇదే ఇతర టీమ్ బౌలర్లకు మన బౌలింగ్​ యూనిట్​కు మధ్య ఉన్న స్పష్టమైన తేడా అని చెప్పొచ్చు. మరి.. ఈ వరల్డ్ కప్​లో భారత బౌలర్ల పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: నా కంటే ఆ భారత కుర్రాడే మంచి బౌలర్‌: వసీం అక్రమ్‌