iDreamPost
android-app
ios-app

భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్‌ రైళ్లలో..

  • Author singhj Updated - 04:53 PM, Fri - 6 October 23
  • Author singhj Updated - 04:53 PM, Fri - 6 October 23
భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్‌ రైళ్లలో..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్​ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ అందర్నీ అలరించింది. అయితే ఈ మ్యాచ్ అనుకున్నంత రసవత్తరంగా జరగలేదు. కివీస్ టీమ్ ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో చెలరేగి ఆడింది. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ దుమ్మురేపడంతో ఫేవరెట్​గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీమ్ చిత్తయింది. ఈ మ్యాచ్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ భారత్ ఆడే మ్యాచులపై పడింది. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్​తో టీమిండియా ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఆ తర్వాతి మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​తో ఆడనున్న భారత్.. మూడో మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో తాడోపేడో తేల్చుకోనుంది.

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్​ చూసేందుకు వరల్డ్ వైడ్​గా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. వరల్డ్ కప్​లోనే ఫుల్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్​ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అహ్మదాబాద్​కు రానున్నారు. దీంతో అక్కడి హోటల్స్​కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆ మ్యాచ్ రోజు వివిధ సిటీస్ నుంచి అహ్మదాబాద్​కు వెళ్లే ఫ్లైట్ టికెట్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో క్రికెట్ ఫ్యాన్స్​కు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్​కు స్పెషల్ వందే భారత్ ట్రైన్స్​ను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. త్వరలోనే ఈ ట్రైన్స్​ షెడ్యూల్, టికెట్ రేట్స్ తదితర వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్​లోని హోటల్స్ రేట్స్, ఫ్లైట్ టికెట్ రేట్స్ భారీగా పెరిగిన నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్​కు ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ స్పెషల్ సర్వీసులను నడపాలని డిసైడ్ అయినట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు నేషనల్ మీడియాకు తెలిపారు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి కొన్ని గంటల ముందు ఈ ట్రైన్స్ సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయన్నారు. ఈ రెండు స్టేషన్లు మ్యాచ్ జరిగే నరేంద్ర మోడీ స్టేడియానికి దగ్గరగా ఉండటంతో అభిమానులు ఈజీగా అక్కడికి చేరుకోవచ్చన్నారు. అలాగే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ ట్రైన్స్ అహ్మదాబాద్ నుంచి తిరిగి బయల్దేరతాయని పేర్కొన్నారు. దీని వల్ల క్రికెట్ అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: ఆ నాలుగు టీమ్స్ సెమీస్​కు చేరతాయి.. వరల్డ్ కప్​పై సచిన్ ప్రెడిక్షన్!