విరాట్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్. కోహ్లీ నుంచి ఒక విషయం తాను నేర్చుకున్నానని చెప్పాడు. వార్నర్ ఏ విషయం నేర్చుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్. కోహ్లీ నుంచి ఒక విషయం తాను నేర్చుకున్నానని చెప్పాడు. వార్నర్ ఏ విషయం నేర్చుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి రెండు మ్యాచుల్లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ ఛాన్సులపై ప్రశ్నలు తలెత్తాయి. ఛాంపియన్ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆసీస్ మిగిలిన జట్లలా కాదు. తాము ఐసీసీ ట్రోఫీల్లో ఎందుకంత డేంజరస్ అనేది మరోమారు ప్రూవ్ చేస్తూ మెగా టోర్నీలో దుమ్మురేపుతోంది. సూపర్ ఫామ్ అందుకున్న కంగారూ టీమ్.. వన్డే వరల్డ్ కప్‌లో విజయాల హ్యాట్రిక్ కొట్టింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన వేళ.. నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది ఆసీస్. సెమీఫైనల్స్ రేసు ఇంట్రెస్టింగ్గా మారుతున్న టైమ్‌లో రన్‌రేట్‌నూ మెరుగుపర్చుకుంది.
ప్రపంచ కప్-2023లో కీలక దశలో ఫామ్‌లోకి వచ్చిన ఆసీస్ వరుసగా మూడో విజయం సాధించింది. బుధవారం వన్‌సైడ్‌గా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 రన్స్ తేడాతో ఓడించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) మెగా టోర్నీ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు. మ్యాక్స్‌వెల్‌కు తోడుగా డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104), స్టీవ్ స్మిత్ (71), లబుషేన్ (62) రాణించడంతో డచ్ టీమ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆడమ్ జంపా (4/8), మిచెల్ మార్ష్ (2/19) ధాటికి 21 ఓవర్లలో 90 రన్స్‌కే నెదర్లాండ్స్ కుప్పకూలింది. ఆ టీమ్‌లో విక్రమ్‌జీత్ సింగ్ (25) టాప్ స్కోరర్ కావడం గమనార్హం.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ సెంచరీతో బలమైన పునాది వేశాడు. మార్ష్ (9) త్వరగా ఔటైనా స్మిత్‌తో కలసి వార్నర్ మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ మాదిరిగా ఆఫ్ సైడ్ వరుస బౌండరీలతో అలరించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు వార్నర్. అతడ్ని ఆకాశానికి ఎత్తేశాడు. ‘కోహ్లీ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడతాడు. ఇవాళ నేనూ అదే చేశా. భవిష్యత్ తరాలను అతడు ప్రభావితం చేస్తున్నాడు’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం అతడి నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. మరి.. విరాట్‌పై వార్నర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. మియా డామినేషన్ మామూలుగా లేదుగా!
David Warner on Virat Kohli’s Running Between The Wickets #AUSvNED #ODIWorldCup2023 #ICCWorldCup2023 #AUSvsNED pic.twitter.com/4qWyu1sbnn
— RVCJ Media (@RVCJ_FB) October 25, 2023