అసలే వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంక క్రికెట్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట ఆ టోర్నీల్లో ఆడకుండా సింహళ జట్టుపై నిషేధం విధించింది.
అసలే వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంక క్రికెట్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట ఆ టోర్నీల్లో ఆడకుండా సింహళ జట్టుపై నిషేధం విధించింది.
వన్డే వరల్డ్ కప్-2023లో శ్రీలంక దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. యువకులతో కూడిన సింహళ జట్టు సెమీస్‌కు చేరుకుంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ లేవు. కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి బడా టీమ్స్‌కు షాక్ ఇస్తుందేమోనని అంతా అనుకున్నారు. ఇంజ్యురీల కారణంగా కొందరు ప్లేయర్లు మెగా టోర్నీకి దూరమవ్వడం, టీమ్‌లో ఉన్నవాళ్లు కలసికట్టుగా రాణించకపోవడంతో లంక టీమ్ పూర్తిగా తేలిపోయింది. వరుసగా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకున్న ఘనత ఉన్న జట్టు కాస్తా పసికూన మాదిరిగా ఆడటం లంక ఫ్యాన్స్‌నే గాక క్రికెట్ అభిమానులను కూడా ఎంతో నిరాశకు గురిచేసిందని చెప్పొచ్చు. ఒక మ్యాచ్‌లో కాకపోతే మరో మ్యాచ్‌లోనైనా పుంజుకుంటుదేమోనని అనుకుంటే టోర్నీ మొత్తం చెత్తగా పెర్ఫార్మ్ చేసింది.
ఈ వరల్డ్ కప్‌లో ఆడిన 9 మ్యాచుల్లో ఏడింట్లో ఓడింది శ్రీలంక. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలవగలిగింది. టోర్నీ మధ్యలో సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ జట్టుతో చేరినా లంక తలరాతను మాత్రం మార్చలేకపోయాడు. అతడి టైమ్డ్ ఔట్ వరల్డ్ కప్‌లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక క్రికెట్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. ఈ డెసిజన్తో ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్స్‌లో శ్రీలంక పాల్గొనే ఛాన్స్ లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ గవర్నమెంట్ తలదూర్చడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సొంత నిర్ణయాలను తీసుకోవడంలో, స్వచ్ఛందంగా పని చేయడంలో ఐసీసీ రూల్స్‌ను లంక బోర్డు అతిక్రమించిందని తెలిసింది.
సొంతంగా డెసిజన్స్ తీసుకోకపోవడం, స్వచ్ఛందంగా పని చేయడంలో ఫెయిల్ అయినందునే లంక బోర్డుపై ఐసీసీ బ్యాన్ వేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ రూల్స్ ప్రకారం క్రికెట్ బోర్డుల్లో ఆయా దేశాల జోక్యం ఉండకూడదట. గతంలో ఈ కారణంతోనే జింబాబ్వే మీద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్యాన్ విధించడాన్ని క్రికెట్ అనలిస్టులు గుర్తుచేస్తున్నారు. కాగా, వన్డే వరల్డ్ కప్-2023లో లంక టీమ్ దారుణమైన ఆటతీరుతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. దీంతో లంక క్రికెట్ బోర్డును రద్దు చేయాలని ఆ దేశ సర్కారు నిర్ణయం తీసుకుంది. లెజెండరీ క్రికెటర్ అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని కూడా నియమించింది. అయితే ఆ దేశ క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందనే కారణంతో శ్రీలంక బోర్డును ఐసీసీ రద్దు చేసింది. మరి.. శ్రీలంక క్రికెట్ బోర్డు విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తోనే సెమీస్ మ్యాచ్! ఆ ఒక్కడు ఆడితే మ్యాచ్ మనదే!
Sri Lanka Cricket suspended by ICC Board.
More here ⬇️https://t.co/3QcLinUPp0
— ICC (@ICC) November 10, 2023