వరుస ఓటములతో డీలాపడిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ పాక్ సారథిని భయపెడుతున్నాడు.
వరుస ఓటములతో డీలాపడిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ పాక్ సారథిని భయపెడుతున్నాడు.
బాబర్ ఆజం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలిసిన పేరిది. బ్యాట్స్‌మన్‌గా, పాకిస్థాన్ టీమ్ కెప్టెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాబర్. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో చెలరేగి ఆడుతూ పాక్ ఫ్యాన్స్ మనసులను దోచుకున్నాడు. కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్న బాబర్ అదే ఊపును కొనసాగిస్తే గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలుస్తాడని పాక్ మాజీలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో నిలకడగా రన్స్ చేయడం, కూల్‌గా తన పని తాను చేసుకొనిపోయే యాటిట్యూడ్ నచ్చి బాబర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అయితే సారథ్య బాధ్యతలు తీసుకున్నాక బాబర్ బ్యాటింగ్‌లో ఒకప్పటిలా రాణించలేకపోతున్నాడు.
చిన్న టీమ్స్‌పై బాగానే రన్స్ చేస్తున్న బాబర్.. పెద్ద జట్లపై బైలాటరల్ సిరీస్‌ల్లోనూ రాణిస్తున్నాడు. కానీ ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అటు కెప్టెన్‌గా టీమ్‌ను సరిగ్గా నడిపించలేక, ఇటు బ్యాటింగ్‌లో రన్స్ చేయడంలో ఫెయిలై విమర్శల పాలవుతున్నాడు. ప్రస్తుత వన్డే వరల్డ్ కప్‌లోనూ ఇదే పరిస్థితి. వరుసగా టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓటమిపాలైన దాయాది టీమ్ సెమీస్‌కు వెళ్లడం అసాధ్యంలా కనిపిస్తోంది. నెక్స్ట్ ఆడే అన్ని మ్యాచుల్లోనూ నెగ్గడమే గాక భారీ విజయాలతో నెట్రన్ రేట్‌ను మెరుగుపర్చుకోవాలి. అప్పుడు కూడా సెమీస్ బెర్త్ పక్కా అని చెప్పలేని పరిస్థితి. మిగతా టీమ్స్ గెలుపోటములపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది.
కెప్టెన్సీ నాక్స్‌తో టీమ్‌ను ముందుండి లీడ్ చేయాల్సిన బాబర్ ఆజం బ్యాటింగ్‌లో అంతగా రాణించడం లేదు. ఒకవేళ రన్స్ చేసినా అతడి బ్యాటింగ్‌లో దూకుడు కనిపించడం లేదు. ఇది పాక్‌కు మైనస్‌గా మారింది. వరుస ఓటములతో పాక్ డీలాపడటంతో బాబర్‌ను అందరూ టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి దిగిపొమ్మని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో బాబర్‌కు మరో తలనొప్పి మొదలైంది. టీమిండియా యంగ్ సెన్సేషన్ శుబ్‌మన్ గిల్ బాబర్‌కు భయం పుట్టిస్తున్నాడు. బాబర్ పేరు చెబితే చాలు.. ఇన్నాళ్లూ నంబర్ వన్ బ్యాటర్ అంటూ పాక్ ఫ్యాన్స్, సీనియర్స్ గొప్పలు చెప్పేవారు.
ఇప్పుడు బాబర్ ఆజం ప్లేస్‌కు గురిపెట్టాడు శుబ్‌మన్ గిల్. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో 823 పాయింట్లతో గిల్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న బాబర్ ఆజం (829)కు గిల్‌కు మధ్య తేడా ఆరు పాయింట్లు మాత్రమే. వరల్డ్ కప్‌లో కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తే త్వరలో అతడు నంబర్ వన్ ర్యాంకు సాధించడం ఖాయమే. దీంతో నెటిజన్స్ బాబర్‌ను ఇంకా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్స్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని.. గిల్ వచ్చేస్తున్నాడు, నీ ర్యాంకు గోవిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ర్యాంకింగ్స్‌లో గిల్ రెండో పొజిషన్‌కు చేరుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అదే నన్ను ఈ స్థాయిలో ఉంచింది.. నేను పాటించే నినాదమదే: విరాట్ కోహ్లీ
Shubman Gill is 6 Points away from No.1 ODI Ranking….!!!
Babar Azam – 829.
Shubman Gill – 823. pic.twitter.com/00DOvK3nQt— Mufaddal Vohra (@mufaddal_vohra) October 25, 2023