2023 వరల్డ్ కప్ మహా సంగ్రామానికి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. దీంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి టీమ్స్ అన్ని. అయితే అందరూ ఊహించిన విధంగానే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు చేసింది ఐసీసీ. ఇండియా-పాక్ మ్యాచ్ తో సహా 9 మ్యాచ్ ల తేదీల్లో మార్పులు చేసింది. మార్పుల అనంతరం రీ షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను అధికారికంగా ప్రకటించింది. మరి మార్పులు జరిగిన మ్యాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అందరూ అనుకున్నట్లుగానే ఐసీసీ కొన్ని మ్యాచ్ లను అనుకున్న తేదీల కంటే ముందుగా.. మరికొన్ని మ్యాచ్ లను ఒక రోజు వెనక నిర్వహించనుంది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఇండియా-పాక్ మ్యాచ్ ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14నే జరగనుంది. ఆ రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ మ్యాచ్ ను మార్చాలని ఐసీసీకి విన్నవించుకుంది.
దీనిపై సానుకూలంగా స్పందించిన ఐసీసీ పలు మ్యాచ్ ల తేదీల్లో మార్పులు చేసింది. రీ షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి.. అక్టోబర్ 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14న జరుగుతుంది. ఇక అక్టోబర్ 14న జరగాల్సిన ఇంగ్లాండ్-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది. హైదరాబాద్ లో అక్టోబర్ 12న జరగాల్సిన పాక్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న నిర్వహించనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని మ్యాచ్ లు ముందుకు, వెనక్కి జరిగాయి. సవరించిన షెడ్యూల్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది ఐసీసీ.
Updates fixtures have been revealed for #CWC23 👀
Details 👉 https://t.co/OxtDvdD1xO pic.twitter.com/or7ksGYDWs
— ICC (@ICC) August 9, 2023
ఇదికూడా చదవండి: మ్యాచ్‌కి ముందు జరిగిన మీటింగ్ గురించి బయటపెట్టిన సూర్య! కెప్టెన్ వార్నింగ్‌తో..