భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. అతడు కొట్టిన ఒక షాట్‌ను ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గుర్తించింది.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. అతడు కొట్టిన ఒక షాట్‌ను ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గుర్తించింది.
క్రికెట్లో ఎన్నో రకాల షాట్స్ ఉన్నాయి. మొదట్లో అంతా సంప్రదాయ షాట్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే టీ20ల సందడి షురూ అయిందో అప్పటి నుంచి కొత్త రకం షాట్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఇలాంటి షాట్లకు సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను ఆద్యుడిగా చెప్పొచ్చు. మిస్టర్ 360గా పేరొందిన డివిలియర్స్ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టగలడు. ప్రస్తుత క్రికెటర్లలో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, టీమిండియా హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇలాంటి షాట్స్ ఆడగలరు. టీ20లు ఎక్కువగా ఆడుతుండటం వల్లో ఏమో వన్డేల్లోనూ ఆఖరి ఓవర్లలో డిఫరెంట్ షాట్స్‌తో రన్స్ రాబడుతున్నారు బ్యాట్స్‌మెన్.
పొట్టి ఫార్మాట్లో దాదాపుగా ప్రతి బ్యాట్స్‌మన్ అటాకింగ్‌కు దిగుతుంటారు. ఈ క్రమంలో అడ్డగోలు షాట్స్ ఆడటం లేదా డిఫరెంట్ షాట్స్ కొడుతూ రన్స్ తీయడం చూస్తుంటాం. రివర్స్ స్వీప్, దిల్ స్కూప్ లాంటివి ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం చూసే ఉంటారు. అయితే ఇలాంటి షాట్స్ ఆడటం చాలా కష్టం. అదే సమయంలో సరిగ్గా టైమ్ కాకపోతే వికెట్లు పోయే డేంజర్ కూడా ఉంది. ఇలాంటి షాట్స్ కొడుతూ వికెట్లు పారేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొత్త రకం షాట్స్ మీద డిపెండ్ కాకుండా సంప్రదాయ క్రికెటింగ్ షాట్స్, బుక్ క్రికెట్‌కే పరిమితమయ్యే ప్లేయర్లు కూడా ఉన్నారు. వారిలో ఒకడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు.
టీ20లు, టెస్టులు, వన్డేలు.. ఇలా ఫార్మాట్ ఏదైనా కోహ్లీ దాదాపుగా ఒకే రకంగా ఆడతాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నామా లేదా ఛేజింగ్‌కు దిగామా అనే దాన్ని బట్టి కాస్త శైలి మార్చుకుంటాడు. బాల్స్, కొట్టాల్సిన రన్స్‌ను కౌంట్ వేసుకొని లెక్కల ప్రకారం ఆడతాడు విరాట్. ముఖ్యంగా టీ20ల్లో అతడి గేమ్‌ను మెచ్చుకోవాల్సిందే. సాధారణంగా భారీ షాట్లు కొట్టని కోహ్లీ.. టీ20ల్లో మాత్రం ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆఖర్లో బౌండరీలు, సిక్సులు కొట్టి స్ట్రైక్ రేట్‌ను లెవల్ చేసేస్తాడు. ఈ క్రమంలో డిఫరెంట్ షాట్ల జోలికి పోకుండా తన మార్క్ షాట్లతోనే రన్స్ పిండుకుంటాడు. అలాంటి విరాట్ కొట్టిన ఒక షాట్‌కు అరుదైన గౌరవం దక్కింది.
గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో దాయాది పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఓ షాట్‌ను ఈ శతాబ్దంలోనే బెస్ట్ షాట్‌గా ఐసీసీ పేర్కొంది. ఆ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ పాక్ పేసర్ హ్యారిస్ రౌఫ్ వేసిన ఫాస్ట్ డెలివరీని విరాట్ స్ట్రయిట్ సిక్స్‌గా మలిచాడు. అలాంటి షాట్‌ను ఎప్పుడూ చూడని స్టేడియంలోనే ప్రేక్షకులతో పాటు టీవీలు, ఫోన్లలో చూస్తున్న కోట్లాది మంది ఫ్యాన్స్ షాకయ్యారు. ఇది షాట్ అంటే అంటూ రన్ మెషీన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. పాక్‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్ తన ఫేవరెట్ అని విరాట్ ఒక సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 82 రన్స్ చేసిన టీమ్‌కు విజయాన్ని అందించాడు. మరి.. కోహ్లీ కొట్టిన షాట్ శతాబ్దంలోనే అత్యుత్తమ షాట్‌గా ఎంపికవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: VIDEO: ఇలాంటి పిచ్చి కొట్డుడు మీరెప్పుడు చూసి ఉండరు!
ICC says “Virat Kohli’s shot against Haris Rauf” as the shot of the century.
– The GOAT 🐐 pic.twitter.com/xoOactZjo7
— Johns. (@CricCrazyJohns) November 7, 2023
ICC declared this shot of Virat Kohli as the Shot of the Century 🔥 pic.twitter.com/xw7WZYTb9D
— Crickfan (@crickadda07) November 7, 2023