iDreamPost

VIDEO: ఇలాంటి పిచ్చి కొట్డుడు మీరెప్పుడు చూసి ఉండరు!

  • Author Soma Sekhar Published - 08:22 PM, Tue - 7 November 23

ఓ ఊరమాస్ షాట్ ఆస్ట్రేలియా-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో నమోదు అయ్యింది. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ కొట్టిన ఈ సిక్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి.

ఓ ఊరమాస్ షాట్ ఆస్ట్రేలియా-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో నమోదు అయ్యింది. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ కొట్టిన ఈ సిక్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి.

  • Author Soma Sekhar Published - 08:22 PM, Tue - 7 November 23
VIDEO: ఇలాంటి పిచ్చి కొట్డుడు మీరెప్పుడు చూసి ఉండరు!

వరల్డ్ కప్ లో చరిత్రలో ఎన్నో విచిత్రమైన షాట్లు మనం చూసే ఉన్నాం. అయితే ఒక షాట్ కు మించి మరోటి కొడుతూనే ఉన్నారు బ్యాటర్లు.ఇక ఆ షాట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఊరమాస్ షాట్ ఆస్ట్రేలియా-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో నమోదు అయ్యింది. ఇలాంటి షాట్ బహుశా మీరెప్పుడూ చూసుండరు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ కొట్టిన ఈ సిక్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సిక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ 2023లో మరో సంచలనం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మెగాటోర్నీలో భాగంగా.. తాజాగా ఆసీస్-ఆఫ్గాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ టీమ్.. అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. మరీ ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ జద్రాన్ చివరి దాకా క్రీజ్ లో నిలబడి అజేయ శతకంతో పాటుగా జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లకు చివర్లో చుక్కలు చూపించాడు స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్. తన మెరుపు బ్యాటింగ్ తో అభిమానులను అలరించి.. సిక్సర్లతో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రషీద్ కొట్టిన సిక్స్ ప్రత్యేకమైనది. మిచెల్ స్టార్క్ ఈ ఓవర్ 5వ బంతిని షార్ట్ పిచ్ లో వేశాడు. ఆ బాల్ ను బట్టలు ఉతికినట్లు షాట్ కొట్టాడు రషీద్. బంతి అమాంతం వెళ్లి ప్రేక్షకుల్లో పడింది. ఇక ఈ షాట్ చూసిన స్టార్క్ షాక్ తిని, చిరునవ్వు చిందించాడు.

ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో రహ్మాత్(30), షహిదీ(26) పరుగులు చేశారు. అనంతరం 292 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 19 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేసి.. ఓటమి దిశగా పయనిస్తోంది. ఆసీస్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో మూకుమ్మడిగా విఫలం అయ్యారు. దీంతో వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదు కానుంది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి