iDreamPost
android-app
ios-app

ఏపీలో IASల బదిలీలు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!

ఏపీలో IASల బదిలీలు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ ఒకేసారి పలువు  ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఇప్పటికే  పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ వచ్చిన జగన్ సర్కార్.. తాజాగా మరికొందరు ఐఏఎస్  అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో కొన్ని జిల్లాలకు జాయిట్ కలెక్టర్లను ఏపీ సర్కార్  నియమించింది. గతంలో కలెక్టర్ల గా పని చేసిన వారిని వివిధ శాఖలకు డైరెక్టర్ల నియమించింది.

తాజా ఉత్తర్వుల్లో హర్టికల్చర్ డిపార్ట్మెంట్ కు గంధం చంద్రుడుని నియమించారు. ఆయన గతంలో ఉమ్మడి అనంతపురంకి కలెక్టర్ గా  పని చేశారు. అలానే మరో ఐఏఎస్ హెచ్ఎం ధ్యాన చంద్రను గ్రామ,వార్డు సచివాలయ అసిస్టెంట్ డైరెక్టరుగా నియమించారు. సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా నిశాంతి, కొనసీమజిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీవాస్ నూపూర్, నంద్యాల జేసీగా రాహుల్ కుమార్ రెడ్డి నియమించారు. కేఆర్ పురం ఐటీడీఏ పీవోగా సూర్యతేజ బదిలీ చేశారు. ఎస్ ఎస్ శ్రీధర్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

అలానే ఈ మధ్యనే పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా ఆర్.గోవిందరావు, అన్నమయ్య జిల్లా జేసీగా పర్మాన్ అహ్మద్ ను, బీసీ తరగతుల ఆర్థిక కార్పొరేషన్ కు వీసీ, ఎండీగా క్రైస్ట్ కిషోర్ కు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే.  అలానే ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ గా హిమాన్షు కౌశిక్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఎ. భర్వత్ తేజ్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగ డైరెక్టర్ గా వి. ఆంజనేయులు కు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఐఏస్  బదిలీలను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. మరి.. ఈ బదిలీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించిన ధీరజ్‌ సింగ్‌..