iDreamPost
android-app
ios-app

వైరల్‌గా మారిన పిల్లాడి వ్యాఖ్యలు.. పుట్టిన 9 రోజులకే నడిచాడట!

వైరల్‌గా మారిన పిల్లాడి వ్యాఖ్యలు.. పుట్టిన 9 రోజులకే నడిచాడట!

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వటం చాలా ఈజీ. అయితే, మనం ఏ విధంగా ఫేమస్‌ అవుతున్నామన్నది పాయింట్‌. నెగిటివ్‌గా ఫేమస్‌ అవుతున్నామా? పాజిటివ్‌గా ఫేమస్‌ అవుతున్నామా?.. మనం చేసిన పని వల్ల నెటిజన్లు మనల్ని పొగుడ్తూ ఉంటే అది పాజిటివ్‌.. అలా కాకుండా మనల్ని ట్రోల్‌ చేస్తున్నారనుకోండి అది నెగిటివ్‌. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌గా ఫేమస్‌ అయ్యేవారి కంటే.. నెగిటివ్‌గా ఫేమస్‌ అయ్యేవారే ఎక్కువ. తాజాగా, ఓ బాలుడు తన వ్యాఖ్యల కారణంగా ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. అది కూడా నెగిటివ్‌గా ఫేమస్‌ అయ్యాడు. ఎందుకంటే అతడు చేసిన వ్యాఖ్యలు నమ్మసఖ్యంగా లేకపోవటమే ఇందుకు కారణం.

ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడుకు చెందిన ఓ బాలుడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఈ విధంగా ఉంది.. ‘‘ మా అమ్మానాన్న పిల్లల కోసం ఎంతో ట్రై చేశారు. ఆస్పత్రికి వెళ్లినపుడు.. మా అమ్మ కడుపులో ఓ మగ బిడ్డ ఉన్నాడని చెప్పారు. అయితే, ఆ బిడ్డ పుట్టడానికి అవకాశం లేదు అన్నారు. ఒక వేళ బిడ్డ పుడితే.. మా అమ్మకు ఉన్న ఇబ్బంది వల్ల ఆమె చనిపోతుంది. లేదంటే అబార్షన్‌ చేయాలి. అబార్షన్‌ చేస్తేనే అమ్మ బతకుతుంది అన్నారు.

దీంతో అమ్మానాన్న ఢీలా పడిపోయారు. బాధతో దేవుడ్ని ప్రార్థించారు. నా గురించి దేవుడికి మొక్కుకున్నారు. తర్వాతి ఉదయం డెలివరీ కోసం ఆపరేషన్‌ థియేటర్‌కు పోయారు. మీరు బిడ్డను కనొచ్చు.. మీకెలాంటి సమస్య లేదు అని చెప్పారు. నేను పుట్టినపుడు 5 కిలోలు ఉండేవాడ్ని. నేను పుట్టను అని చెప్పారు. నేను పుట్టడానికి అవకాశమే లేదు అన్నారు. 9 రోజుల్లో నిలబడ్డ ఒకే ఒక్క పిల్లాడిని నేనేనండి. పుట్టిన 9 రోజుల్లోనే బాత్‌రూముకు కూడా పోయేవాడ్ని. నేనే కూర్చునేవాడ్ని..

నేనే పడుకునేవాడ్ని. నడిచే వాడ్ని.. చైర్‌లో నేనే కూర్చునేవాడ్ని’’ అని ఉంది. దీంతో నెటిజన్లు.. పుట్టిన 9 రోజుల్లోనే నడవటం ఏంటి? అంటూ ట్రోలింగ్స్‌ మొదలుపెట్టారు. తన వ్యాఖ్యలపై ఆ పిల్లాడు క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో ‘‘ నేను 9 రోజులు అని తప్పుగా చెప్పాను. కాదు.. 9 నెలలు. 9 నెలలు అని చెప్పడానికి బదులు 9 రోజులు అని చెప్పాను’’ అని అన్నాడు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పిల్లాడి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి