iDreamPost
android-app
ios-app

Hyderabad వాసులకు జలమండలి అలర్ట్‌.. వారికి నీళ్లు బంద్‌.. కారణమిదే

  • Published Jun 21, 2024 | 8:14 AM Updated Updated Jun 21, 2024 | 8:24 AM

హైదరాబాద్‌ వాసులకు జలమండలి అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. వారికి నీళ్లు బంద్‌ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ వాసులకు జలమండలి అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. వారికి నీళ్లు బంద్‌ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

  • Published Jun 21, 2024 | 8:14 AMUpdated Jun 21, 2024 | 8:24 AM
Hyderabad వాసులకు జలమండలి అలర్ట్‌.. వారికి నీళ్లు బంద్‌.. కారణమిదే

వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం ప్రారంభం అయ్యింది. ఇంకా జోరు వానలైతే మొదలు కాలేదు కానీ.. వాతావరణం చల్లబడింది. ఇక వేసవిలో జనాలు ఇటు ఎండ వేడి.. అటు కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. వేసవిలో నీటి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. కొరత కూడా మిగతా సీజన్లలో కన్నా అప్పుడే కాస్త ఎక్కువ. దాంతో జలమండలి అధికారులు.. నగరవాసులకు అలర్ట్‌ జారీ చేశారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని.. జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి జలమండలి అధికారులు.. హైదరాబాద్‌ వాసులకు కీలక అలర్ట్‌ చేశారు. అలాంటి వారి నీటి కనెక్షన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించారు. వారికి నీటి సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదాయమార్గాలు పెంచుకునే పనిలో పడ్డారు. నీటి బిల్లుల మొండి బకాయిలు పక్కాగా వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు జలమండలి ఉన్నతాధికారులు.. కింది స్థాయి సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటి బిల్లు బకాయిలను కచ్చితంగా వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడమే కాక.. భారీగా బకాయి పడిన ఇంటి యజమానుల జాబితాను రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో ఉన్న వారికి బకాయిలు చెల్లించాలని ముందు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. అయినా సరే డబ్బులు కట్టని వాళ్ల ఇంటికి నల్లా కనెక్షన్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

పది వేల రూపాయల కన్నా ఎక్కువ మొండి బకాయిలు దాటిన గృహ, వాణిజ్య నల్లాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. వీటితో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు కూడా జలమండలి నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా సంస్థల బకాయిలు కూడా భారీగా పెరిగిపోయాయి. మొత్తంగా ఇవి 1500 కోట్ల రూపాయల దాటాయని జలమండలి అధికారులు అంచనా వేశారు. వీటిని వెంటనే చెల్లించాలని ఆయా శాఖల హెచ్‌ఓడీలకు జలమండలి అధికారులు లేఖలు రాయనున్నారు.

కొత్త నల్లాలు, నీటి బిల్లుల ద్వారా జలమండలికి ప్రతి నెలా రూ.115 – రూ.130 కోట్ల ఆదాయం వస్తోంది. ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లుల కింద ఖర్చులు రూ.160 వరకు కోట్లు దాటుతోంది. దీంతో ఆదాయం కంటే వ్యయమే ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో బకాయిలపై  దృష్టి సారించిన జలమండలి అధికారులు పక్కగా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.