iDreamPost

Hyderabad: పార్కుల్లో రొమాన్స్‌.. జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Published Feb 24, 2024 | 9:43 AMUpdated Feb 24, 2024 | 9:43 AM

పార్కుల్లో రొమాన్స్‌ చేసే జంటలకు హైదరాబాద్‌ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..

పార్కుల్లో రొమాన్స్‌ చేసే జంటలకు హైదరాబాద్‌ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 24, 2024 | 9:43 AMUpdated Feb 24, 2024 | 9:43 AM
Hyderabad: పార్కుల్లో రొమాన్స్‌.. జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో పిల్లలను తీసుకుని పబ్లిక్‌ పార్కుల్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూడు జంటలే. ఏదో సరదాగా మాట్లాడుకోవడానికి వచ్చారు కదా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. పార్కుల్లో జనాలు, చిన్నారులు తిరుగుతున్నా సరే.. వారు మాత్రం పబ్లిక్‌గా రొమాన్స్‌ చేసుకుంటూ.. పరమ రోతగా ప్రవర్తిస్తారు. చుట్టూ జనాలు ఉన్నారు.. అన్న కనీస ఇంగితం మర్చిపోయి మరీ ఒకరిపై ఒకరు పడుతూ.. ఎంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలను తీసుకుని కుటుంబంతో కలిసి పార్క్‌కు వెళ్లిన వారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారిని ఏమనలేక.. మనమే తల దించుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా ఉండగా పబ్లిక్‌ పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలకు హైదరాబాద్‌ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..

పబ్లిక్ పార్కులకు వెళ్దామనుకునే నగర వాసులను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యపై హైదరాబాద్‌ పోలీసులు దృష్టి సారించారు. సాయంత్రం సమయంలో సేద తీరేందుకు, ఫ్యామిలీతో, చిన్నారులతో సరదాగా గడిపేందుకు పార్క్‌లకు వెళ్తున్న చాలా మందికి అక్కడికి వచ్చే జంటలు చేస్తున్న పనులు ఇబ్బందికరంగా మారాయి. ఎవరూ ప్రశ్నిస్తారనే ధైర్యమో లేక చూసినా ఏం పర్లేదులే అనే తెగింపో తెలియదు గానీ.. యువ జంటలు పార్కుల్లో రెచ్చిపోతున్నాయి. బహిరంగంగానే రొమాన్స్‌ చేసుకుంటూ చుట్టూ ఉన్న వారి గురించి మర్చిపోతుంటారు.

బెంచీల మీద, పొదల సమీపంలో కూర్చుని.. పబ్లిక్ గానే కిస్సులు, హగ్గులతో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా ఇందిరా పార్క్, కృష్ణకాంత్‌పార్క్‌, నెక్లెస్ రోడ్ ప్రాంతాలో ఇలాంటి దృష్యాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. జంటలు చేసే పనులు వారికి అంగీకారమే కావచ్చు కానీ.. చూసేవారికి మాత్రం చాలా ఇబ్బంది. పైగా చిన్న పిల్లలు ఇలాంటి దృశ్యాలను చూస్తే.. వారి మనసులో లేనిపోని అనుమానాలు రావడమే కాక.. ఆ చిన్నారులపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుంది. వీరిని చూసి మరికొందరూ ఆ దారిలో నడుస్తారు.

ఏన్నో ఏళ్లుగా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో ఇందిరా పార్క్ యాజమాన్యం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అది వివాదంగా మారింది. పార్కులో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు 2021 ఆగస్టులో ‘పెళ్లి కాని జంటకు ప్రవేశం లేదు’ అని పార్క్ బయట యాజమాన్యం బోర్డు పెట్టింది. అయితే ఇది వివాదంగా మారడంతో దానిని వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ పోలీసులు దీనిపై దృష్టి సారించారు.

దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన షీ టీమ్స్ శుక్రవారం రంగంలోకి దిగాయి. పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ తో పాటు పలు పబ్లిక్ ప్లేసుల్లో జంటలను షీ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇంకో సారి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి, జరిమాన విధించి పంపిచారు. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇక నుంచి తమ నిఘా ఉంటుందని షీ టీమ్ అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి