iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రాత్రి ఒంటి గంట వరకు సేవలు

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రాత్రి ఒంటి గంట వరకు సేవలు

హైదరాబాద్ మహానగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించిందనే చెప్పవచ్చు. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందింది. మెట్రో ప్రయాణానికి ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి పురస్కరించుకుని అర్థరాత్రి ఆ సమయం వరకు మెట్రో సేవలను నడిపేందుకు యోచిస్తున్నట్లు ఎన్ వీ ఎస్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఆ సమయం వరకు ప్రయాణించే వీలు ఏర్పడనుంది.

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునే భక్తులకు ప్రయాణాల్లో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలను అందించనున్నట్లు హెఎంఆర్ఎల్ ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి తెలిపారు. దీంతో అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునే భక్తులు ఆలస్యంగానైనా మెట్రో స్టేషన్ కు చేరుకోవచ్చని తెలిపారు. దీనికోంస ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ తో పాటు సమీప స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్ వీ ఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో మెట్రో స్టేషన్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.