హైదరాబాద్ మహానగరంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రయాణం కోసం సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ సిటీ బస్సుల్లో రోజూ వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. కండక్టర్ కి డబ్బులు చెల్లించి.. టికెట్ తీసుకుని హాయ్ గా ప్రయాణం చేస్తుంటారు. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లినా కూడా వంద కంటే ఎక్కువ ఉండదు. ఇంకా ఎక్కువ అనుకుంటే 200 ఉంటుంది. అయితే గురువారం ఓ ప్రయాణికుడికి ఏకంగా రూ.29వేల టికెట్ ను కండక్టర్ ఇచ్చాడు. ఆ టికెట్ చూసిన ప్రయాణికుడి ప్రాణంపోయినంత పని అయింది. ఈ ఘటన పటాన్ చెరువు ప్రాంతంలో జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గురువారం రాణిగంజ్ డిపోకు చెందిన బస్సు పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది. 219 నంబర్ కలిగిన ఈ బస్సు గురువారం ఇస్నాపూర్ నుంచి సికింద్రబాద్ కు బయలు దేరింది. ఈ క్రమంలో ఇస్నాపూర్ లో ఓ ప్రయాణికుడు ఆ బస్సు ఎక్కాడు. తనకు బాలానగర్ ఎక్స్ రోడ్ వరకు టికెట్ ఇవ్వమని కండక్టర్ ను అడిగారు. అయితే కండక్టర్ ఇస్నాపూర్ నుంచి బాలానగర్ కు టికెట్ ఇచ్చాడు. కండక్టర్ ఇచ్చిన టికెట్ సదరు ప్రయాణికుడు చూసి షాకయ్యాడు. అందులో రూ.29,210 అని రాసి ఉంది. ఇందేది రా సామీ.. తాను ఎక్కింది బస్సా లేకా విమానమా అనే సందేహం వ్యక్తం చేశాడు. తోటి ప్రయాణికులకి కూడా చూపించాడు.
దీంతో కండక్టర్ సదరు వ్యక్తికి వేరే టికెట్ ఇచ్చారు. టికెట్ మెషీన్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పు జరిగిందని కండక్టర్ తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కూడా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వారు తెలిపారు. ప్రయాణికుడి నుంచి మాత్రం బస్సు టికెట్ ధరను మాత్రమే తీసుకున్నారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. హైదరాబాద్ లో సిటీ బస్సుల టికెట్ ధరలు..విమాన టికెట్ ధరల కంటే ఖరీదులా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఏం కష్టమొచ్చిందో పాపం.. రన్నింగ్ బస్ కింద తలపెట్టిన మహిళ!