iDreamPost

టెక్నాలజీలో మరో సంచలనం.. AI పిన్ వచ్చేస్తోంది.. స్మార్ట్ ఫోన్లు మాయం!

టెక్నాలజీలో మరో సంచలనం. ఇప్పటికే పలు రకాల స్మార్ట్ పరికరాలు అందుబాటులో ఉండగా మరో పరికరం సంచలనంగా మారనుంది. ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ ఏఐ పిన్ స్మార్ట్ ఫోన్ కు బదులుగా వాడుకునేలా మారబోతోంది. భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్ కనుమరుగవనున్నట్లు తెలుస్తోంది.

టెక్నాలజీలో మరో సంచలనం. ఇప్పటికే పలు రకాల స్మార్ట్ పరికరాలు అందుబాటులో ఉండగా మరో పరికరం సంచలనంగా మారనుంది. ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ ఏఐ పిన్ స్మార్ట్ ఫోన్ కు బదులుగా వాడుకునేలా మారబోతోంది. భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్ కనుమరుగవనున్నట్లు తెలుస్తోంది.

టెక్నాలజీలో మరో సంచలనం.. AI పిన్ వచ్చేస్తోంది.. స్మార్ట్ ఫోన్లు మాయం!

టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచమంతా ఇంటర్నెట్ మయమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక స్మార్ట్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ పరికరాలతో మానవ జీవితం మరింత సులభతరమవుతోంది. స్మార్ట్ ఫోన్లు, గృహొపకరణాలు, టీవీలు ఇలా ఒక్కటేమిటి ప్రతీది టెక్నాలజీతో మిలితమైనదే. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు, ఆ తరువాత ఫీచర్ ఫోన్స్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్. అందుబాటులో ఉన్న సాంకేతికతతో పరికరాలను మరింత స్మార్ట్ గా మారుస్తూ సంచలనాలకు తెరలేపుతున్నారు. తాజాగా టెక్నాలజీ యుగంలో మరో సంచలనానికి సమయం ఆసన్నమైంది. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏఐ. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ పిన్ అందుబాటులోకి రానుంది. దీంతో భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్స్ కనుమరుగవనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా హ్యుమని అనే స్టార్టప్‌ కంపెనీ ఏఐ పిన్‌ ను ప్రవేశపెట్టింది. ఈ పరికరం చాలా తక్కువ పరిమాణంలో ఉండి అన్ని స్మార్ట్‌ పరికరాలను నియంత్రిస్తుంది. దీన్ని మనం ధరించే షర్ట్స్ పై సులభంగా ధరించొచ్చు. ఈ డివైజ్ లో యూజర్లకు వివిధ ఫీచర్లు అందించడానికి సెన్సార్లు, ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ వినియోగించారు. దీనిలో కెమెరా, మైక్రోఫోన్, యాక్సిలరోమీటర్‌ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. ఇది మీ అరచేతిలో లేదా ఇతర ప్రదేశాలపై సమాచారాన్ని ప్రదర్శించేలా ప్రొజెక్టర్‌ను కలిగి ఉంటుంది.

AI పిన్ ఎలా పని చేస్తుందంటే..

ఏఐ పిన్‌.. సెన్సార్లు, ఏఐ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. వీటి సహాయంతో కావాల్సిన సమాచారం తేలికగా అందిస్తుంది. ఏఐ పిన్ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కు రిప్లేస్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ లో మాదిరిగానే కాల్స్‌, మెసేజ్‌లు చేసేలా, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించేలా, స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్‌ వినేలా టెక్నాలజీని పొందుపరిచారు. ఇంటర్నెట్, సిగ్నల్స్ కూడా ఆ పరికరంలోనే ఉంటాయి. స్మార్ట్‌ఫీచర్లతోపాటు ఏఐ పిన్‌ వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌ డివైజ్‌లోని కెమెరా, మైక్రోఫోన్ లేదా ఇన్‌పుట్ సెన్సార్‌లు పనిచేస్తున్న విషయాన్ని యూజర్లకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఏఐ పిన్ సెన్సార్‌లను నిలిపేసే అవకాశం ఉంటుంది. 2024లో ఏఐ పిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్మార్ట్ వాచ్ ల ద్వారా ఫోన్ కాల్స్, ఇతర సౌకర్యాలు పొందుతున్న వేళ ఇప్పడు ఏఐ పిన్ టెక్నాలజీ యుగంలో మరో సంచలనంగా మారిందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి