iDreamPost

HYD: వర్షాల కారణంగా భారీ ట్రాఫిక్.. ఈ మార్గాల్లో వెళ్తే ఇరుక్కుపోతారు

Huge Traffic Jam: హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ మార్గాల్లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయంలో బయటకు వస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం ఖాయం.

Huge Traffic Jam: హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ మార్గాల్లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయంలో బయటకు వస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం ఖాయం.

HYD: వర్షాల కారణంగా భారీ ట్రాఫిక్.. ఈ మార్గాల్లో వెళ్తే ఇరుక్కుపోతారు

హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ తర్వాత నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల రోడ్లన్నీ మునిగిపోయాయి. మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, లింగంపల్లి, కృష్ణాపూర్, గండి మైసమ్మ, ఉప్పుగూడ, బార్కస్, ఎల్బీనగర్, బహదుర్ పుర, అబ్దుల్లాపూర్ మేట్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి ఆలయ చుట్టుపక్కల వర్షం కురిసింది. వడగండ్ల వాన పడింది. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోటకొండూర్ మండలాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, పటాన్ చేరు, పోతిరెడ్డిపల్లి, మామిడిపల్లిలో ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది.

తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. మరో రెండు రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, పంజాగుట్ట, ఎర్రగడ్డ, లక్డికాపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అయితే మాదాపూర్ లోని ప్రధాన రోడ్లపై వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. నెక్టార్ గార్డెన్, శిల్పారామం రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. మాదాపూర్ నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వెళ్లే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మాదాపూర్ టీ-హబ్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. అలానే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే రోడ్డు మార్గంలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా, గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలో కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. వర్షం నీరుతో జలమయమవ్వడంతో ట్రాఫిక్ జామ్ అయిన చోట జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం పలు చర్యలు చేపడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయంలో వస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం ఖాయం. ముఖ్యమైన పని ఉంటే తప్ప రాకపోవడమే మంచిది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి