iDreamPost

తుపానుతో ట్రైన్ క్యాన్సిలైందా? టికెట్ డబ్బులు ఇలా తిరిగి పొందండి..

How To Get Full Refund, When Train Gets Cancelled: ప్రస్తుతం మిచౌంగ్ తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఇలాంటి సమయంలో ట్రైన్ క్యాన్సిలైతే టికెట్ మొత్తం ఎలా పొందాలో చూడండి.

How To Get Full Refund, When Train Gets Cancelled: ప్రస్తుతం మిచౌంగ్ తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఇలాంటి సమయంలో ట్రైన్ క్యాన్సిలైతే టికెట్ మొత్తం ఎలా పొందాలో చూడండి.

తుపానుతో ట్రైన్ క్యాన్సిలైందా? టికెట్ డబ్బులు ఇలా తిరిగి పొందండి..

ప్రస్తుతం మిచౌంగ్ తుపాను రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడును కూడా వణికిస్తోంది. ఇప్పటికే ఏపీ- తమిళనాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం వరకు కూడ చెన్నై విమానాశ్రయం మూసివేసే ఉంది. తీవ్ర తుపానుగా మారిన మిచౌంగ్.. దిశ మార్చుకుని నెల్లూరు దగ్గర తీరందాటనుంది. ఈ తుపాను ఎఫెక్ట్ తో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. రోడ్డు రవాణాతో పాటు.. రైళ్ల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150కి పైగా రైళ్లను రద్దు చేసింది. అయితే ఈ రద్దైన రైళ్లలో టికెట్ కొనుగోలు చేసిన వారు ఎలా తిరిగి డబ్బులు పొందాలో చూద్దాం.

సాధారణంగా మీరు పని మీద ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లేందుకు.. దూర ప్రయాణాలు చేసేందుకు రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకుంటారు. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని వాతావరణ పరిస్థితుల వల్ల రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేస్తుంది. ఇలా రద్దు చేసిన సమయంలో మీకు మీ టికెట్ డబ్బులు ఎలా రిఫండ్ పొందవచ్చు. అలా జరిగేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా ట్రైన్ క్యాన్సిల్ అయితేనే కాదు.. మీరు వెళ్లాల్సిన ట్రైన్ డిలే అవుతున్నా కూడా ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుని మీరు రిఫండ్ పొందవచ్చు. కొన్ని వాతావరణ కారణాల వల్ల రైలు పదే పదే వాయిదా పడుతూ ఉంటే.. మీరు మీ టికెట్ ని క్యాన్సి ల్ చేసుకోవచ్చు.

మీరు 3 గంటలకు పైగా ఆలస్యం అయిన తర్వాత మాత్రమే ఆ పని చేయగలరు. మీరు ఎలాంటి క్న్సిలేషన్ ఛార్జెస్ లేకుండానే మొత్తం డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు కౌంటర్ లో టికెట్ తీసుకుని ఉంటే.. మీరు కౌంటర్ లోనే టికెట్ రిఫండ్ రిక్వెస్ట్ చేస్తే మంచిది. ఒకవేళ ఐఆర్సీటీసీ యాప్ లో గనుక టికెట్ బుక్ చేసుకుంటే.. మీరు టికెట్ క్యాన్సిలేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత పదే పదే వాయిదా పడుతూ.. 3 గంటలు కన్నా ఎక్కువ ఆలస్యం అయితే మీరు ఈ పని చేయచ్చు. దీనిని టికెట్ డిపాజిట్ రిసిప్ట్(TDR) అంటారు. ఇలా టీడీఆర్ ఫైల్ చేయడం ద్వారా మీరు మీ టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే మీకు పూర్తి నగదు రిఫండ్ అవుతుంది.

ఒకవేళ అనుకోని కారణాలే చేత రైలును రద్దు చేస్తే.. మీ టికెట్ డబ్బులు మీకు ఆటోమేటిక్ గా రిఫండ్ అవుతాయి. అందుకు 3 నుంచి 7 పనిదినాల సమయం పట్టచ్చు. ఒకవేళ కౌంటర్లో టికెట్ తీసుకున్నాక రైలు రద్దు అయితే రిజర్వేషన్ కౌంటర్ లోనే టికెట్ డబ్బు పొందాల్సి ఉంటుంది. ట్రైన్ డిపార్చర్ టైమ్ నుంచి 3 రోజుల్లోపు మీరు ఈ టికెట్ డబ్బును కలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలోనూ మీకు పూర్తి డబ్బును వాపస్ చేస్తారు. ఇవన్నీ కూడా ట్రైన్ ఆలస్యం అయినా.. క్యాన్సిల్ అయినా మాత్రమే చేయగలరు. కానీ, మీ వ్యక్తిగత కారణాల రీత్యా గనుక ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి