iDreamPost

ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పే సూచనలు.. ఇలా చేస్తే ఫోన్ సేఫ్!

Signs Of SmartPhone Hack: ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. అయితే ఈ ఫోన్ల వల్ల లాభాలు మాత్రమే కాదు.. నష్టాలు కూడా చాలానే ఉన్నాయి.

Signs Of SmartPhone Hack: ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. అయితే ఈ ఫోన్ల వల్ల లాభాలు మాత్రమే కాదు.. నష్టాలు కూడా చాలానే ఉన్నాయి.

ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పే సూచనలు.. ఇలా చేస్తే ఫోన్ సేఫ్!

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు లైఫ్ లో ఒక భాగంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వల్ల మనిషి జీవితంలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అన్నీ పనులు డిజిటల్ గానే సాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వల్ల మనిషి జీవితం ఎంతో సులభతరంగా మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ని ఎంతో తేలిగ్గా హ్యాక్ చేస్తారు. అలా హ్యాక్ అయితే మీ డేటా, ఫొటోలు మాత్రమే కాకుండా.. మీ అకౌంట్స్ లో ఉండే నగదు కూడా పోతుంది. అందుకే తమ ఫోన్ హ్యాక్ అయ్యిందా అనే అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అయితే హ్యాక్ అయ్యిందని తెలుసుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

ఎలా తెలుసుకోవాలి?:

సాధారణంగా మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో అనే అనుమానం వచ్చిందంటే మీ ఫోన్ కచ్చితంగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉండాలి. మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పే మొదటి సూచన మీరు ఇన్ స్టాల్ చేయని కొన్ని యాప్స్ మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సాధరణంగా కంటే కూడా ఎంతో ఫాస్ట్ గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఫోన్ వాడకపోయినా కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఫోన్ వాడుతున్నప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే యాప్స్ ఓపెన్ అవ్వడం, ఫోన్ నుంచి కాల్స్ వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మీకు కాల్ చేయని నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు పంపని మెసేజ్లు ఇన్ బాక్స్ లో దర్శనం ఇస్తుంటాయి. బ్రౌజింగ్ హిస్టరీలో మీరు సెర్చ్ చేయని వెబ్ సైట్స్, మీరు ఓపెన్ చేయని పేజెస్ కనిపిస్తూ ఉంటాయి. మీతో సంబంధం లేకుండా స్క్రీన్ లాక్, యాంటీ వైరస్ వంటివి డిసేబుల్ అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పచ్చు.

ఏం చేయాలి?:

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందనే అనుమానం వస్తే.. ముందుగా మొబైల్ డేటా, వైఫై కనెక్షన్ ని ఆపేయండి. అలా చేయడం వల్ల మీ ఫోన్ మీద హ్యాకర్ కి పట్టు తగ్గుతుంది. మీ ఫోన్ నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ కాంటాక్ట్స్ లోని అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి. మీ నంబరు నుంచి ఏమైనా లింక్స్, యూఆర్ఎల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకండని హెచ్చరించాలి. అలా చేయడం వల్ల వారి ఫోన్స్ కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఫోన్లో ఉన్న అనుమానాస్పద, మీరు డౌన్లోడ్ చేయని యాప్స్ ని డిలీట్ చేయాలి. ఫోన్లో ఉన్న యాంటీ వైరస్ ని రన్ చేయాలి.

మంచి యాంటీ వైరస్ లేకపోతే.. ట్రస్టెడ్ పోర్టల్ నుంచి ఒక మంచి యాంటీ వైరస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మాల్ వేర్ ఏమైనా ఉందా అని సెర్చ్ చేయాలి. అంతేకాకుండా ఏపీకే ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడం మానుకోవాలి. వాటి వల్ల కూడా మాల్ వేర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మీ ఫోన్ లో ఉన్న మాల్ వేర్ ని క్లియర్ చేసిన తర్వాత.. మీ బ్యాంక్ అకౌంట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పాస్ వర్డ్స్ మార్చుకోవాలి. ఏ అకౌంట్ ఆ అకౌంట్ సంబంధం లేకుండా స్ట్రాంగ్ పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి. అంతేకాకుండా పాస్ వర్డ్స్ ని ఫోన్ లో సేవ్ చేసుకోకూడదు. ఇలా మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? అయ్యాక ఏం చేయాలి అనే విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని.. వారిని కూడా అలర్ట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి