Somesekhar
టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ దినేశ్ కార్తీక్ తెలుగు వాడేనని మీలో ఎంతమందికి తెలుసు? ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ దినేశ్ కార్తీక్ తెలుగు వాడేనని మీలో ఎంతమందికి తెలుసు? ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Somesekhar
దినేశ్ కార్తీక్.. 38 ఏళ్ల వయసులోనూ యంగ్ క్రికెటర్లకు పోటీగా తుఫాన్ ఇన్నింగ్స్ లు ఆడుతూ..దుమ్మురేపుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి ఫినిషర్ గా తన సత్తా ఏంటో చూపించాడు. అయితే ఇప్పటి వరకు దినేశ్ కార్తీక్ తమిళనాడుకు చెందిన క్రికెటర్ అనే అందరూ అనుకుంటున్నారు. కానీ అతడు మన తెలుగు వాడేనని ఎంత మందికి తెలుసు? డీకే తెలుగు లో చక్కగా మాట్లాడుతున్న ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
టీమిండియాలో తెలుగు క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ తో పాటుగా అంబటి రాయుడు, తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ లేటెస్ట్ సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్ ఇలా మరికొంత మంది ప్లేయర్లు ఉన్నారు. అయితే టీమిండియా ఫినిషర్ దినేశ్ కార్తీక్ సైతం తెలుగు మూలాలు ఉన్న వ్యక్తేనని మనలో చాలా తక్కువ మందికి తెలుసు. గతేడాది జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ల గురించి తెలుగు క్రికెట్ యాంకర్ వింధ్య విశాకతో మాట్లాడిన క్రమంలో డీకే మాతృ భాష తెలుగు అని తెలిసింది. దీంతో యాంకర్ అయితే తెలుగులో మాట్లాడొచ్చుకదా అని డీకేని అడగ్గా..” నాకు కొంచెమే తెలుగులో మాట్లాడటం వచ్చు.. పూర్తిగా వచ్చిన తర్వాత మాట్లాడుతాను” అని సెమీఫైనల్ మ్యాచ్ ల గురించి వివరించాడు.
కాగా దినేశ్ కార్తీక్ తల్లి పద్మిని కృష్ణకుమారి తెలుగు మూలాలు ఉన్నవారిగా తెలుస్తోంది. కానీ కుటుంబ అవసరాల నిమిత్తం తమిళనాడు లో స్థిరపడ్డారు. ఇదిలా ఉండగా.. గతంలో 2021 ఐపీఎల్ సీజన్ లో కామెంటేటర్ తెలుగులో ప్రశ్నించగా.. అచ్చతెలుగులో ఆన్సర్ ఇచ్చి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. డీకే తెలుగు ఇంత చక్కగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని. ఇప్పుడు అర్ధమైంది. అతడి మాతృ భాష తెలుగు అయినప్పుడు ఎందుకు మాట్లాడడు? అని ఇది తెలిసిన కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి డీకే తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అని మీలో ఎంత మందికి తెలుసు? కామెంట్స్ రూపంలో తెలపండి.
Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal https://t.co/wzXWSdp2Rf pic.twitter.com/FmXdU8rY0w
— Krishnamurthy (@krishna0302) October 15, 2021