iDreamPost

KKR vs RR: వీడియో: బట్లర్ బ్యాటింగ్ కు షారుఖ్ ఫిదా.. మ్యాచ్ ఓడినా మనసు గెలుచుకున్నాడు!

కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో వీరోచిత సెంచరీతో రాజస్తాన్ గెలిపించిన జోస్ బట్లర్ బ్యాటింగ్ కు షారుఖ్ ఖాన్ ఫిదా అయ్యాడు. దీంతో గ్రౌండ్ లోకి వచ్చి..

కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో వీరోచిత సెంచరీతో రాజస్తాన్ గెలిపించిన జోస్ బట్లర్ బ్యాటింగ్ కు షారుఖ్ ఖాన్ ఫిదా అయ్యాడు. దీంతో గ్రౌండ్ లోకి వచ్చి..

KKR vs RR: వీడియో: బట్లర్ బ్యాటింగ్ కు షారుఖ్ ఫిదా.. మ్యాచ్ ఓడినా మనసు గెలుచుకున్నాడు!

క్రికెట్ లవర్స్ కు అసలైన కిక్కిచ్చింది కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్. నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ పోరులో రాజస్తాన్ జట్టు అసమాన పోరాటంతో విజయం సాధించిన తీరు అద్భుతం. కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వీరోచిత సెంచరీతో జోస్ బట్లర్ హీరోగా నిలిచాడు. 50 బంతుల్లో సెంచరీ చేసిన బట్లర్ ఈ ఐపీఎల్ లో రెండో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ స్టార్ ఆటకు ఫిదా అయ్యాడు కేకేఆర్ ఓనర్, కింగ్ ఖాన్ షారుఖ్. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోల్ కత్తా నైట్ రైడర్స్ ను 2 వికెట్ల తేడాతో ఓడించింది రాజస్తాన్ రాయల్స్. ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించింది ఈ మ్యాచ్. బాల్ బాల్ కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకు విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. కానీ జోస్ బట్లర్ అసమాన్య పోరాటం ముందు కేకేఆర్ తలొంచక తప్పలేదు. ఆర్ఆర్ టీమ్ ఓడిపోయింది అనుకున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని రీతిలో చెలరేగాడు బట్లర్. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 107 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బ్యాటింగ్ కు ఫిదా అయ్యాడు కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్.

Sharukh khan

రాజస్తాన్ మ్యాచ్ గెలిచిన అనంతరం ఆటగాళ్లు గ్రౌండ్ లో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చాడు షారుఖ్ ఖాన్. తమ ప్లేయర్లకు చీర్ చేస్తూ.. నెక్ట్స్ మ్యాచ్ లో గెలుద్దాం అన్న విధంగా అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ మైదానంలో తిరుగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ హీరో జోస్ బట్లర్ కనపడగానే దగ్గరికి వచ్చి మరీ ప్రేమతో కౌగిలించుకున్నాడు. నవ్వుతూ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు షారుఖ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జట్టు ఓడిపోయినప్పటికీ.. మీరు మాత్రం మనసులు గెలుచుకున్నారు షారుఖ్ అంటూ కితాబిస్తున్నారు. తమ టీమ్ ఓడిపోయినా.. ప్రత్యర్థి జట్టును షారుఖ్ అభినందించడం నిజంగా ఆకట్టుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి