iDreamPost
android-app
ios-app

అప్పుడే ఓటిటిలోకి ‘బాయ్స్ హాస్టల్’! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

  • Author ajaykrishna Updated - 12:36 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Updated - 12:36 PM, Thu - 31 August 23
అప్పుడే ఓటిటిలోకి ‘బాయ్స్ హాస్టల్’! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

సాధారణంగా ఒక భాషలో సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. మిగతా భాషల ప్రేక్షకులు కూడా ఆ సినిమా వైపు ఆసక్తి చూపిస్తుంటారు. ఆ సినిమా మన భాషలో కూడా వస్తే బాగుంటుందని భావిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన చిన్న సినిమా ‘హాస్టల్ హొడుగురు బేకాగిద్దరే’. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూల్ చేసింది. దీంతో ఈ సినిమా గురించి తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేశారు.

మొత్తానికి హాస్టల్ హొడుగురు బేకాగిద్దరే.. బాయ్స్ హాస్టల్ పేరుతో తెలుగులో రిలీజ్ అయ్యింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఆగష్టు 26న విడుదలైన ఈ సినిమా.. తెలుగులో కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగాను బాక్సాఫీస్ వద్ద రాణిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డెబ్యూ డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి తెరకెక్కించిన బాయ్స్ హాస్టల్ మూవీ.. జనరల్ గా హాస్టల్ లో జరిగే ఫన్ ఎలిమెంట్స్ తో పాటు క్రైమ్ ని కూడా జోడించి హిట్టు కొట్టేసాడు. కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేసిన ఈ సినిమాని.. తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. తెలుగు వెర్షన్ కోసం కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఒరిజినల్ లో రిషబ్ శెట్టి, రమ్య క్యారెక్టర్స్ ని తెలుగులో రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ పోషించారు. కాగా.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 ఓటిటి వారు చేజిక్కించుకున్నారు. అయితే.. ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కాబోతుందట. అదేంటీ.. మొన్నే కదా రిలీజ్ అయ్యింది.. అప్పుడే ఓటిటి రిలీజ్ ఏంటా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే.. సెప్టెంబర్ 1 నుండి కన్నడ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు కాంతార, విరూపాక్ష ఫేమ్ అజనీష్ మ్యూజిక్ అందించాడు. మరి బాయ్స్ హాస్టల్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.