iDreamPost

హనీరోజ్ కొత్త మూవీ రేచల్ టీజర్ రిలీజ్.. ఈసారి గట్టిగానే భయపెట్టింది!

Honey Rose Rachel Movie Teaser Review: హనీరోజ్ నుంచి సినిమా అప్ డేట్స్ లేవని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో బాధ పడిపోతున్నారు. తన అభిమానులకు హనీరోజ్ బిగ్ సర్ ప్రైజ్ తీసుకొచ్చింది. తన రేచల్ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

Honey Rose Rachel Movie Teaser Review: హనీరోజ్ నుంచి సినిమా అప్ డేట్స్ లేవని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో బాధ పడిపోతున్నారు. తన అభిమానులకు హనీరోజ్ బిగ్ సర్ ప్రైజ్ తీసుకొచ్చింది. తన రేచల్ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

హనీరోజ్ కొత్త మూవీ రేచల్ టీజర్ రిలీజ్.. ఈసారి గట్టిగానే భయపెట్టింది!

హనీరోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇప్పటికే పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలాగే మలయాళం సినిమాలు చూసే అలవాటు ఉన్న వారికి హనీరోజ్ సుపరిచితురాలే. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో హనీరోజ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె నటించిన అన్ని మలయాళం సినిమాలు కూడా చూసేశారు. అయితే ఆ మూవీ తర్వాత హనీరోజ్ నుంచి ఎలాంటి కొత్త సినిమా రాలేదు. హనీరోజ్ న్యూ మూవీ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని చాలా మంది ఎదురు చూశారు. అలాంటి వారిని ఇప్పుడు క్రేజీ అప్ డేట్ తో హనీరోజ్ సర్ ప్రైజ్ చేసింది.

సాధారణంగా హనీరోజ్ అనగానే నవ్వుతూ.. మంచి చీరకట్టులోనో.. మోడ్రన్ డ్రెస్సులోనే ఊహించుకుంటారు. ఇప్పటివరకు సినిమాల్లో కూడా అలాగే చూశారు. కానీ, ఈ కొత్త మూవీ టీజర్లో మాత్రం అందుకు భిన్నంగా కనిపంచనుంది. ఈ అమ్మడు ఇప్పటివరకు కనిపించని ఒక వైలెంట్ పాత్రలో కనపించబోతోంది. లేడీ ఓరియంటెడ్ మూవీ అయిన రేచల్ నుంచి టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్లో దాదాపుగా హనీరోజ్ పాత్రను వివరించారు. ఈ పాత్ర ప్రతీకారం తీర్చుకోవడానికి పరితపిస్తున్నట్లు చూపించారు. తనకు ఎవరో అన్యాయం చేశారు అనే పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేశారు.అలాగే ఆమె ఎవరి కోసమో వెతుకుతోంది అనే విషయాన్ని చెప్పారు.

అంతేకాకుండా.. వారిని వెతికి మరీ చంపాలి అని ఆమె శపథం చేస్తుంది. అలాగే ఈ మూవీలో గట్టిగానే వైలెన్స్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టీజర్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతోంది. హనీరోజ్ ఈసారి చాలా కొత్తగా కనిపించబోతోంది. అంతేకాకుండా ఒక భిన్నమైన పాత్ర చేస్తోంది. పైగా ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రాబోతోంది మొత్తం 5 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు టీజర్ లో ప్రకటించారు. సౌత్ లో హనీరోజ్ మార్కెట్ గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి హనీరోజ్ ఎప్పుడెప్పుడు మూవీ అప్ డేట్ ఇస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు మంచి సర్ ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. ఈ మూవీ అనౌన్స్ చేసిన చాలారోజులకు టీజర్ తో పలకరించారు. మరి.. హనీరోజ్ రేచల్ మూవీ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి