iDreamPost

మగవారి కంటే ఎక్కువ సంపాదించాలా? అయితే ఈ జాబ్స్ మీ కోసమే!

Jobs For Women: అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మగాళ్లతో పోటీ పడి మరీ సంపాదిస్తున్నారు. అయితే కొన్ని జాబ్స్ విషయాలకొచ్చేసరికి మగాళ్లతో పోలిస్తే జీతాలు తక్కువగా వస్తున్నాయ్. మీరు కనుక ముందే కెరీర్ ప్లానింగ్ సెట్ చేసుకుంటే ఈ ఫీల్డ్ లో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

Jobs For Women: అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మగాళ్లతో పోటీ పడి మరీ సంపాదిస్తున్నారు. అయితే కొన్ని జాబ్స్ విషయాలకొచ్చేసరికి మగాళ్లతో పోలిస్తే జీతాలు తక్కువగా వస్తున్నాయ్. మీరు కనుక ముందే కెరీర్ ప్లానింగ్ సెట్ చేసుకుంటే ఈ ఫీల్డ్ లో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

మగవారి కంటే ఎక్కువ సంపాదించాలా? అయితే ఈ జాబ్స్ మీ కోసమే!

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో భార్యాభర్తలిద్దరూ రెండు చేతులా సంపాదిస్తేనే గానీ హైదరాబాద్ లాంటి సిటీల్లో నెట్టుకురావడం కష్టం. లేదంటే జీతంలో సగం రెంట్ కి, కరెంట్ కి, ఎగస్ట్రా టాలెంట్ కి ఖర్చయిపోతాయి. అందుకే ఇప్పుడు ఆడవాళ్లు కూడా సంపాదన మీద పడ్డారు. అయితే మగాళ్లతో పోలిస్తే కొన్ని జాబ్స్ లో జీతాలు తక్కువ. మగాళ్ళకైతే ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని లేడీస్ ని జాబ్ లోకి తీసుకుని తక్కువ జీతం ఇస్తారు. అయితే మగాళ్ల కంటే ఎక్కువ జీతం రావాలంటే కనుక మీరు ఈ రంగాల మీద ఫోకస్ చేయాల్సిందే. పెళ్ళికి ముందే చదువుకునే రోజుల్లోనే ఒక క్లారిటీకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. పెళ్లి కాకుండా ఇంకా ఎవరైనా చదువుకుంటూ ఉంటే కనుక ఈ జాబ్స్ మీకు హెల్ప్ అవుతాయి.

వీటిలో ఏరోస్పేస్ ఇంజనీర్ జాబ్ ఒకటి. ఇంటర్ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. విమానం, అంతరిక్ష నౌకల రూపకల్పన, వాటి అభివృద్ధి, ఉత్పత్తి వంటివి చూసుకోవడమే ఏరోస్పేస్ ఇంజనీర్ పని. ఈ ఫీల్డ్ లో కెరీర్ గ్రోత్ అనేది గొప్పగా ఉంటుంది. అలానే జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే ఫార్మసిస్ట్ లకి కూడా మంచి డిమాండ్ ఉంది. హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఫార్మసిస్ట్ గా పని చేస్తే మంచి జీతం ఉంటుంది. కెరీర్ కూడా బాగుంటుంది. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఈ ఫీల్డ్ చాలా డెవలప్ అయ్యింది. ఏ కారణంగా నిపుణుల డిమాండ్ పెరిగింది. కాబట్టి మహిళలు ఫార్మసిస్టు రంగంలో కెరీర్ ని ఎంచుకుంటే జీవితం మెరుగ్గా ఉంటుంది.

ఆ తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చే జాబ్స్ లో లాయర్ జాబ్ ఒకటి. న్యాయశాస్త్రంలో మంచి పేరుతో పాటు ఆదాయాన్ని కూడా బాగా ఆర్జించవచ్చు. కార్పొరేట్ చట్టం, మేధో సంపత్తి చట్టం, వైద్య చట్టం వంటి వాటిలో ఏదో ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేస్తే భారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. న్యాయవృత్తిని ఎంచుకున్నట్లైతే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక ఆ తర్వాత మంచి జీతం వచ్చే జాబ్స్ లో సోషల్ మీడియా జాబ్స్ ఒకటి. సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ స్ట్రాటజిస్ట్, కమ్యూనిటీ మేనేజర్, బ్రాండ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజర్, సోషల్ మీడియా స్పెషలిస్ట్ వంటి జాబ్స్ ఉన్నాయి. ఈ రంగంలో ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ జీతం సంపాదించుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు ఎంచుకుంటున్న జాబ్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి