iDreamPost

ముగిసిన హైపవర్‌ కమిటీ సమావేశం – స్పష్టత ఇచ్చిన మంత్రి పేర్ని నాని

ముగిసిన హైపవర్‌ కమిటీ సమావేశం – స్పష్టత ఇచ్చిన మంత్రి పేర్ని నాని

జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. కమిటీ అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు రెండోసారి హైపవర్‌ కమిటీ విజయవాడలో సమావేశమైంది. రెండు కమిటీల నివేదికలల్లోని అంశాలను పరిశీలించిన కమిటీ, వాటిపై మరింత క్షణ్నంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే మరో మారు ఈ నెల 13వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

రాజధాని అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని నాని చెప్పారు. అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకుంటామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీలో చర్చజరిగిందన్నారు. అభివృద్ధి 13 జిల్లాల్లో జరిగేలా, పరిపాలన అన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతం కావాల్సి ఉందన్నారు. తమకు అన్యాయం జరిగిందన్న ఆలోచన ప్రజల్లో కలగకూడదనే తమ లక్ష్యంమన్నారు.

ఈ నెల 13వ తేదీన జరగబోయే సమావేశంలో జీఎన్‌ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదకల్లోని అంశాలపై హైపవర్‌ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని నాని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి