iDreamPost

16 మంది తో హైపవర్ కమిటీ

16 మంది తో హైపవర్ కమిటీ

ఏపీ రాజధానిపై 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తారు. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిమూలపు సురేశ్, పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ సహా అజయ్ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్ సభ్యులుగా నియమించింది.

జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించి మూడు వారాల్లోగా నివేదికను అందజేయనుంది. హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 3 తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చే అవకాశం ఉండగా ఆ తర్వాతే హైపవర్ కమిటీ పని ప్రారంభం కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి