iDreamPost

పో*ర్న్ వీడియోలు చూడటం నేరం కాదు: హైకోర్టు

పో*ర్న్ వీడియోలు చూడటం నేరం కాదు: హైకోర్టు

పో*ర్న్ వీడియోలు చూడటం నేరం.. అలా చేస్తే జైలుశిక్ష కూడా పడుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ, హైకోర్టు మాత్రం పో*ర్న్ వీడియోలు చూడటం నేరం కాదు అని తీర్పు ఇచ్చింది. అయితే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మీరు అశ్లీల వీడియోలు చూస్తే మీరు జైలుకు వెళ్లాల్సిందే. కాకపోతే మీ వ్యక్తిగత సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పో*ర్న్ వీడియోలు చూడటం నేరం కాదు. అదే విషయాన్ని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసు 2016లో నమోదు అయింది. ఒక 33 ఏళ్ల వ్యక్తి అలువా ప్యాలెస్ సమీపంలోని రోడ్డు పక్కన మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 292 కింద కేసు కూడా నమోదు చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, విచారణను రద్దు చేయాలంటూ ఆ వ్యక్తి కోర్టును కోరాడు. అందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. “పో*ర్నోగ్రఫీ, అశ్లీలత కొన్ని దశాబ్దాలుగా ఉన్నది. ఇప్పుడు ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత.. చిన్న పిల్లలకు కూడా అశ్లీలత దగ్గరైంది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమయంలో ఎవరికీ చూపించకుండా అశ్లీల వీడియోలు చూడటం నేరంగా పరిగణిస్తారా? అనేది ప్రశ్న నిర్ణయించాల్సిన ప్రశ్న అవుతుంది.

అలాంటి వీడియోలు చూడటం అనేది అతని వ్యక్తిగత ఎంపిక. దానిని నేరంగా పరిగణించి న్యాయస్థానం ప్రకటించలేదు. ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అంటే అతని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంద” అంటూ కేరళ హైకోర్టు వెల్లడించింది. ఒక వ్యక్తి వ్యక్తిగత సమయంలో అశ్లీల చిత్రాలు చూడటం, తన మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు, చిత్రాలు చూడటం ఐపీసీ సెక్షన్ 292 కింద నేరంగా పరిగణింపబోదని చెప్పారు. కానీ, ఒక వ్యక్తి అలాంటి వీడియోలు.. చిత్రాలను షేర్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, పబ్లిక్ గా వాటిని ప్రదర్శించడం మాత్రం ఐపీసీ సెక్షన్ 292 కింద నేరంగా పరిగణింపబడుతుందని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి