iDreamPost

నాని బాధ ‘హాయ్ నాన్న’ తీర్చింది! ఇదీ రియల్ సక్సెస్!

శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా వంటి డిఫరెంట్ స్టోరీస్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు నాచురల్ స్టార్ నాని. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు విడుదలైన హాయ్ నాన్న కూడా ఆ కోవకు చెందిందే. సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు. అయితే..

శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా వంటి డిఫరెంట్ స్టోరీస్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు నాచురల్ స్టార్ నాని. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు విడుదలైన హాయ్ నాన్న కూడా ఆ కోవకు చెందిందే. సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు. అయితే..

నాని బాధ ‘హాయ్ నాన్న’ తీర్చింది! ఇదీ రియల్ సక్సెస్!

నాచురల్ స్టార్ నాని నుండి ఇటీవల వచ్చిన మూవీ హాయ్ నాన్న. ఈ మూవీతో మన ఇంట్లో మనిషిగా మారిపోయాడు నాని. కంప్లీట్ ఫ్యామిలీ మాన్ లుక్‌లో కట్టిపడేశాడు. తండ్రి పాత్రలో వాహ్వా అనిపించాడు. ఒక ఫీల్ గుడ్ మూవీని అందించాడు కొత్త దర్శకుడు శౌర్యువ్. డీసెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్లతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాల నుండి నానిలో ఏదో మిస్సైయ్యాం అన్న ఫీలింగ్ ఈ చిత్రంతో పొగొట్టాడని చెప్పొచ్చు. విరాజ్ పాత్రలో సెటిల్డ్ ఫెర్మారెన్స్ ఇచ్చాడు. కూతురి ప్రేమ, స్నేహం పరితపించే సగటు తండ్రిగా మారిపోయాడు ఈ సహజ నటుడు. డిసెంబర్ 8 నుండి థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేస్తోంది.

ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్, ఇప్పటి వరకు కలెక్షన్లు చూస్తే.. 75 శాతానికి పైగా ఈ సినిమాపై పెట్టిన ఖర్చు రికవరీ చేసేసింది. ఇక బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 10 కోట్ల లోపు షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే ఈ నెల 22 వరకు పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ అమౌంట్ క్రాస్ చేసే అవకాశాలున్నాయి. ఓ రకంగా  చెప్పాలంటే హాయ్ నాన్న మూవీ విషయంలో నాని రియల్ సక్సెస్ సాధించాడు. ఎందుకంటే గత కొన్ని సినిమాల నుండి టాక్ పరంగా హిట్ అని వస్తున్నప్పటికీ.. కలెక్షన్లు రాబట్టడం లేదు. దసరా కూడా సూపర్ హిట్ అని టాక్ వచ్చింది. కానీ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ దాటలేదని ఇండ్రస్ట్రీ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ సమయంలో నానికి హిట్టే కాదూ కలెక్షన్ పరంగా కూడా తన స్థామినాను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాయ్ నాన్న మూవీకి లభిస్తున్న ఆదరణ కానీ, కలెక్షన్లు కానీ అతడికి ఊరటనిచ్చాయి.

ఇండస్ట్రీలో నంబరింగ్ గేమ్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు నాని. అలాగే కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. దసరాతో మాస్ పల్స్ పట్టిన బాయ్స్ నెక్ట్స్ డోర్ అన్నట్లు ఉండే ఈ హీరో.. ఆ సినిమాలే చేస్తాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ టచ్ ఉండే చిత్రాలు చేస్తూ సక్సెస్ బాట పట్టాడు. తనకు సెట్ అయ్యే మూవీస్ చేస్తూ.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ నానిలాంటి కుర్రాడు ఉంటే బాగుణ్ణు అనేలా చేస్తున్నాడు. అలాగే ఇలాంటి పిక్చర్స్ వల్ల అతడూ ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇదే రుజువైంది హాయ్ నాన్న మూవీతో. కొత్త కథల్లో నటిస్తూ.. అప్ కమింగ్ యాక్టర్స్ కూడా హోప్‌నిస్తున్నాడు. కలెక్షన్ల పరంగానే కాకుండా ఈ మూవీ విషయంలో ఫుల్ సాటిస్ఫైడ్ అవుట్ పుట్ అందించారు నాని అండ్ చిత్రయూనిట్. మరీ ఈ మూవీ విషయంలో నానిపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి