iDreamPost

OTTలోకి వచ్చేస్తున్న భజే వాయు వేగం.. ఎప్పుడంటే?

  • Published Jun 09, 2024 | 3:38 PMUpdated Jun 09, 2024 | 6:21 PM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. కాగా, ఈ మూవీని కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డితెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎక్కడంటే..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. కాగా, ఈ మూవీని కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డితెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jun 09, 2024 | 3:38 PMUpdated Jun 09, 2024 | 6:21 PM
OTTలోకి వచ్చేస్తున్న భజే వాయు వేగం.. ఎప్పుడంటే?

యంగ్ హీరో ‘కార్తికేయ’.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం చిన్న సినిమాగా తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో అయితే ఈ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవలే కార్తికేయ భజే వాయు వేగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా, ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రశాంత రెడ్డి తెరకెక్కించాడు అయితే ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా గతనెల మే 31న థియేటర్లలో విడదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. మొదట రోజు కాస్త డల్ గా స్టార్ట్ అయినా మౌత్ టాక్ ఆ తర్వాత రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అంతేకాకుండా.. అదే వేగంతో బాక్సాఫిస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. కాగా, ఇటీవలే మూవీ మేకర్స్ సక్సెస్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. అయితే తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎప్పుడంటే..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. కాగా, ఈ మూవీని కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డితెరకెక్కించిగా..  యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఫాథర్ సన్ ఎమోషనల్ అండ్ క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా గతనెల మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. భజే వాయు వేగం సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. కానీ, తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే భజే వాయువేగం మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ జూన్ చివరివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక భజే వాయు వేగం సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో ఓ క్రికెటర్ కావాలని అనుకుంటూ ఉంటాడు. అయితే హీరోకు మంచి ఇల్లు కుటుంబం అంతా బాగానే ఉన్నా కూడా.. అకస్మాత్తుగా పెరిగిన అప్పుల భాధ వలన.. అతని తల్లి దండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. దీనితో ఒక్కసారిగా అతని జీవితం అంతా తారుమారు అవుతుంది. దీంతో అతని తండ్రి స్నేహితుని కుటుంబం ఇతనిని ఆదుకుంటుంది. అప్పటికే వారి ఇంట్లో ఓ కొడుకు ఉంటాడు, దీనితో ఇద్దరినీ సమానంగానే పెంచుతారు ఆ ఫ్యామిలీ. కట్ చేస్తే మరొక సీన్ లో హైదరాబాద్ మేయర్ కొడుకుతో.. ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఓ గొడవ జరుగుతుంది. అనుకోకుండా.. ఓ రోజు ఆ మేయర్ కొడుకు శవం తన తమ్ముడి కార్ లో దొరుకుతుంది. ఇక అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. హీరో కు ఆ హత్యకు ఎమన్నా సంబంధం ఉందా..? అసలు మేయర్ కొడుకు ఎలా చనిపోయాడు..? ఈ హత్య కేసు నుంచి బయట పడ్డారా లేదా, చివరికి ఎలా ముగిసింది. అనే విషయాలపై సినిమా కథంతా తిరుగుతుంది. మరి ఈ విషయాలన్ని తెలియాలంటే వెంటనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే. మరి, భజే వాయు వేగం మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి