iDreamPost

ఎడ్యుకేషన్ లోన్ పై ఆధారపడకుండా.. ఈ మార్గాల ద్వారా విదేశీ విద్య కలను నెరవేర్చుకోవచ్చు

మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? విదేశీ విద్య కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నాారా? అయితే విద్యా రుణంపై ఆధారపడకుండానే ఈ మార్గాల ద్వారా విదేశీ విద్య కలను నెరవేర్చుకోవచ్చు.

మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? విదేశీ విద్య కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నాారా? అయితే విద్యా రుణంపై ఆధారపడకుండానే ఈ మార్గాల ద్వారా విదేశీ విద్య కలను నెరవేర్చుకోవచ్చు.

ఎడ్యుకేషన్ లోన్ పై ఆధారపడకుండా.. ఈ మార్గాల ద్వారా విదేశీ విద్య కలను నెరవేర్చుకోవచ్చు

ప్రస్తుత కాలంలో ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువైపోయింది. చదువుకుంటేనే జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటుందని నమ్ముతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు రెట్టింపు కష్టం చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇక ఇటీవల విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. విదేశాల్లో చదివితే లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయని పిల్లలను ఫారిన్ కు పంపించేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు తల్లిదండ్రులు.

మరి ఫారిన్ లో ఉన్నత విద్య అంటే ఎంతో ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ప్రయాణ ఛార్జీలు, ఫీజులు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి తడిసిమోపెడవుతుంటాయి. అయితే కాస్త ఆర్థికంగా ఉన్నవారు అయితే ఇబ్బంది ఉండదు. కానీ పేద వారికి విదేశీ విద్య కలగానే మిగిలిపోతున్నది. ప్రతిభ ఉండి కూడా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు కొంత సొంత డబ్బు, కొంత ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటుంటారు. అయితే విద్యా రుణం తీసుకోకుండానే కొన్ని మార్గాల ద్వారా విదేశీ విద్య కలను నెరవేర్చుకోవచ్చు. అదెలా అంటే?

Studies in Abroad

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఫారిన్ యూనివర్సిటీలు స్కాలర్ షిప్స్ ను అందిస్తుంటాయి. వాటిల్లో చెవెనింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైనా అర్హత కలిగిన మాస్టర్స్ డిగ్రీ కోసం ఏదైనా యూకే-ఆధారిత విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. విద్యార్థుల కోసం వివిధ విశ్వవిద్యాలయాలలో వర్క్-స్టడీ ప్రోగ్రామ్‌లు అందిస్తాయి.

ఈ ప్రోగ్రామ్‌లు యూనివర్సిటీ క్యాంపస్‌లో అర్హత కలిగిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పార్ట్-టైమ్, పేమెంట్ ఆన్-క్యాంపస్ ఉపాధిని అందిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసిన సొమ్మును అనవసరంగా ఖర్చుచేయకుండా ఉంటే అది మీ విదేశీ విద్యకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొంది విదేశీ విద్యను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఎడ్యుకేషన్ లోన్ అవసరం లేకుండానే విదేశీ విద్య కలను నెరవేర్చుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి