iDreamPost

తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు!

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాగల రెండు రోజులు భారీ వర్షాలు దంచికొట్టనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాగల రెండు రోజులు భారీ వర్షాలు దంచికొట్టనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు!

ఓ వైపు చలికాలం కొనసాగుతూ ఉంటే మరో వైపు వర్షాలు బెంబేలెత్తిపస్తున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ అన్ సీజనల్ రెయిన్స్ మాత్రం కురుస్తూనే ఉన్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాన్ కు మిచౌంగ్ అని పేరు పెట్టింది ఐఎండి. మిచౌంగ్ డిసెంబర్ 5న తీరందాటనున్నది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై పడింది. రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రానికి రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లను జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో సోమవారం నుంచి మంగళవారం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. భూపాలపల్లి, జయశంకర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కూరుస్తాయని చెప్పింది. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి