iDreamPost
android-app
ios-app

కమల్ హాసన్, శివకార్తికేయన్ అరెస్ట్ కోసం తమినాడులో ఆందోళనలు!

  • Published Feb 22, 2024 | 12:44 PM Updated Updated Feb 22, 2024 | 12:44 PM

ప్రస్తుతం యువ తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న సినిమా అమరన్. కానీ, ఇప్పుడు ఈ సినిమా తమిళ నాట కొత్త చర్చలకు దారి తీసింది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ.. కొందరు ఆందోళనలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం యువ తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న సినిమా అమరన్. కానీ, ఇప్పుడు ఈ సినిమా తమిళ నాట కొత్త చర్చలకు దారి తీసింది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ.. కొందరు ఆందోళనలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 22, 2024 | 12:44 PMUpdated Feb 22, 2024 | 12:44 PM
కమల్ హాసన్, శివకార్తికేయన్ అరెస్ట్ కోసం తమినాడులో ఆందోళనలు!

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కు తమిళ నాట మంచి గుర్తింపు ఉంది. వరుస సినిమాలతో ఈ హీరో అందరిని అలరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా శివకార్తికేయన్ , సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “అమరన్”. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రం పలు వివాదాల్లో చిక్కుకుంది. కమల్ హాసన్ తో పాటు , శివ కార్తికేయన్ ను కూడా అరెస్ట్ చేయాలంటూ.. ఈ సినిమాను నిలిపివేయాలంటూ .. పలువురు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేద్దాం అని ప్లాన్ చేస్తున్న మేకర్స్ .. ఈ వివాదాల కారణంగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే అమరన్ సినిమా విషయానికొస్తే .. వీరమరణం చెందిన సైనికుడు ముకుందన్ నిజ జీవితం ఆధారంగా .. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. అయితే, టీజర్ విడుదల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో .. ట్రెండింగ్ లో ఎక్కువ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. కానీ, అదే ఇప్పుడు ఈ సినిమాకు అనుకోని ముప్పు తెచ్చిపెట్టింది . అమరన్ మూవీ టీజర్ లో .. కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయంటూ.. దానికారణంగా ఈ సినిమాను నిలిపివేయాలని .. తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

విడుదల చేసిన అమరన్ మూవీ టీజర్ లో .. కాశ్మిరీలు, ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చే.. కొన్ని సన్నివేశాలను చూపించారు. అంతే కాకుండా కలిసి మెలసి జీవించే హిందువులు, ముస్లింల మధ్య .. విభేదాలను సృష్టించేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ .. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో శివకార్తికేయన్‌ తో పాటు నిర్మాత కమల్‌హాసన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామిలను అరెస్టు చేయాలని.. పలువురు డిమాండ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. వారి దిష్టిబొమ్మలను రోడ్డుపై దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీనితో అక్కడి పరిస్థితులు అదుపు తప్పడంతో .. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చూడబోతుంటే .. అమరన్ సినిమాకు రానున్న రోజుల్లో అడ్డంకులు తప్పేలా లేవు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş