iDreamPost
android-app
ios-app

బాలకృష్ణకు, హరికృష్ణకు తేడా ఇదే! వైరల్ అవుతోన్న పాత వీడియో!

ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనకు జై కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బాలకృష్ణకు కౌంటర్ గా హరికృష్ణ గారి పాత వీడియోలు వైరల్ అవుతోన్నాయి.

ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనకు జై కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బాలకృష్ణకు కౌంటర్ గా హరికృష్ణ గారి పాత వీడియోలు వైరల్ అవుతోన్నాయి.

బాలకృష్ణకు, హరికృష్ణకు తేడా ఇదే! వైరల్ అవుతోన్న పాత వీడియో!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఏళ్ల చరిత్ర కలిగి, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిన టీడీపీ.. నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్లింది అంటే.. జనసేనకు జై కొట్టే పరిస్థితి వచ్చింది. ఇటీవలే హిందూపురం సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. టీడీపీతో పాటు. జనసేన కుండువా కప్పుకున్నారు. ఇలా టీడీపీ నేతల, అందులోనూ బాలకృష్ణ నోట జనసేన మాట రావడంతో ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారని టాక్. ఇదే సమయంలో గతంలో నందమూరి హరికృష్ణకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయి. అయితే జనసేనాను కాదని టీడీపీ ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు ఉమ్మడి కార్యచరణ రూపొందించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతలు నియోజవర్గ స్థాయిలో ఉమ్మడి భేటీలు నిర్వహిస్తున్నాయి. అలానే ఇటీవలే హిందూపురంలో ఏర్పాటు చేసిన ఓ సభలో నందమూరి బాలకృష్ణ.. జనసేనతో కలిసి నడవడం సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాక జై జనసేన అంటూ నినాదాలు చేశారు.

అసలు ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ.. అందులోనే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ.. జనసేనకు జై చెప్పడం.. ఆ పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారంట. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో తో పాటు గతంలో హరికృష్ణ మాట్లాడిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. హరికృష్ణ మాట్లాడుతూ..నేను ఎప్పుడు మనసులో మాటను దాచుకోను. అలానే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తలవంచను. ఎవరికి తలవంచే ప్రసక్తే లేదు… అలా తల వచ్చే వాడినే అయితే నందమూరి తారక రామరావు కడుపు పుట్టి ఉండే వాడినే కాదు.

ఆయన మాకు ఇచ్చింది తల వంచుకుని బతకడం కాదు. కృషి చేయి.. విజయం సాధించు అన్నారు” అని హరికృష్ణ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఆ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కదా హరికృష్ణకు బాలకృష్ణకు ఉన్న తేడా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉండగానే పక్క పార్టీకి జై కొట్టిన బాలకృష్ణ ఎక్కడ, ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటాను అనే హరికృష్ణ ఎక్కడా.. అని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీడీపీ కష్టాల్లో ఉంటే బాధ్యత తీసుకుని బాలకృష్ణే ముందుడి నడిపించాలి కానీ, పక్క పార్టీని నమ్ముకుని,  ఆ పార్టీకి జై కొట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.  పార్టీ పవర్ లో ఉన్నప్పుడు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. అదే కష్టాల్లో ఉంటే.. మరొకరి ముందు తలవంచడం ఏంటని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో హరికృష్ణ ఉంటే కథ మరోలా ఉండేదని, బాలకృష్ణ మాదిరి ఉండదని  టీడీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş