iDreamPost

Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు? అసలు విషయం ఏంటంటే?

హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు అతడి భార్యకు పటడం లేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు అతడి భార్యకు పటడం లేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు? అసలు విషయం ఏంటంటే?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గత కొంత కాలంగా అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కొన్ని నెలలుగా అతడికి ఏదీ కలిసి రావడం లేదు. గాయం కారణంగా వరల్డ్ కప్ 2023 నుంచి మధ్యలోనే నిష్క్రమించిన పాండ్యా.. ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. కెప్టెన్ గా అనుభవం లేకున్నా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి మరీ కెప్టెన్ పగ్గాలను అందించింది. కానీ దారుణంగా విఫలం అయిన ముంబై టోర్నీ నుంచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో పాండ్యాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. తాజాగా పాండ్యాకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది.

ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పూర్తిగా విఫలం అయ్యాడు హార్దిక్ పాండ్యా. 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు మ్యాచ్ ల్లోనే విజయం సాధించి.. ఇంటిదారి పట్టింది. దాంతో పాండ్యాపై విమర్శల వర్షం కురిసింది. ఈ విమర్శల కారణంగా అతడు మానసికంగా కుంగిపోయాడు. ఇక ఇప్పుడు హార్దిక్ కు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ కు పాండ్యాకు పడటం లేదని, వారి మధ్య విభేదాలు ఉన్నాయి అన్నది ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తలు రావడానికి కారణం ఏంటంటే?

నటాషా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాండ్యాతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం లేదు. దాంతో వారిద్దరి మధ్య అభిప్రాయాభేదాలు వచ్చాయని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఆమె పిక్స్ షేర్ చేయకపోవడానికి వేరే కారణం ఉందంటున్నారు హార్దిక్ ఫ్యాన్స్. పాండ్యాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నటాషాను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నమన్నాడట పాండ్యా. పైగా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేయెుద్దని సూచించాడట. అందుకే ఆమె ఎలాంటి పిక్స్ ను గత కొన్ని రోజులుగా పోస్ట్ చేయడం లేదు. దీంతో నెటిజన్లు వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని పొరపడుతున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా నటాషా నుదుటిపై బొట్టు పెట్టుకుని.. “అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు” అంటూ ఓ పిక్ ను పోస్ట్ చేసింది. దాంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టమైంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి