iDreamPost
android-app
ios-app

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అహంకారం ఉంది.. ABD సంచలన కామెంట్స్!

  • Published May 10, 2024 | 3:19 PM Updated Updated May 10, 2024 | 3:19 PM

పాండ్యా కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. మరి ఇంత ఘాటు కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి?

పాండ్యా కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. మరి ఇంత ఘాటు కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి?

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అహంకారం ఉంది.. ABD సంచలన కామెంట్స్!

MI కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి హార్దిక్ పాండ్యాపై ముప్పేటా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. అందుకు తగ్గట్లుగా ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలం అయ్యింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన ముంబై.. ఈసారి గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది. ఇక ఈ సీజన్ లో కెప్టెన్ పాండ్యా తీరుపై మాజీలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరాడు సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్. ఇంతకు ముందు వచ్చిన విమర్శల కంటే కాస్త ఘాటుగానే స్పందించాడు ఏబీడీ. పాండ్యా కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

ముంబై జట్టు రెండుగా చీలిపోయిందని, డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్లకు పాండ్యాకు పడటం లేదని కుప్పలు తెప్పలుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. పాండ్యా కెప్టెన్సీలో వైఫల్యం కావడంతో.. అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ సైతం పాండ్యా కెప్టెన్సీని ఏకిపారేశాడు. పాండ్యా నాయకత్వంపై ఏబీడీ మాట్లాడుతూ..”ఈ సీజన్ లో ముంబై కచ్చితంగా నాకౌట్స్ కు చేరుకోవాలని నేను బలంగా కోరుకున్నాను. కానీ అది జరగలేదు. టీమ్ లో ఎక్కడో లోపం జరుగుతోంది. ఇటీవలే మాజీ కెప్టెన్ రోహిత్ మాట్లాడిన మాటలను నిశీతంగా పరిశీలిస్తే.. జట్టు సభ్యుల్లో సానుకూల వాతావరణం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక పాండ్యా గ్రౌండ్ లో ధైర్యంగ టీమ్ ను ముందుకు నడిపిస్తున్నట్లు అందరికీ కనిపిస్తోంది. కానీ అందులో అతడి అహంకారం క్లీయర్ గా కనిపిస్తోంది” అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

Hardik Pandya

“ధోని లెక్క చేద్దామని పాండ్యా ప్రయత్నిస్తున్నాడు. కానీ గుజరాత్ లాంటి యంగ్ ప్లేయర్లు ఉన్న టీమ్స్ లో పాండ్యా కెప్టెన్సీ సాధ్యపడుతుంది. అనుభవం లేని వారే పాండ్యా లాంటి కెప్టెన్సీని ఇష్టపడతారు. కానీ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లు ఉన్న ముంబై లాంటి టీమ్ కు ఈ నాయకత్వం సరైంది కాదు. పైగా పాండ్యా అనుసరించే వ్యూహాలు ముంబై టీమ్ కు సరిగ్గా సరిపోవట్లేదు. ఇవన్నీ గమనించకుండా పాండ్యా తన తీరున తను వ్యవహరించడం జట్టుకు భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది” అంటూ తన అభిప్రాయాలను తెలియపరిచాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఢిల్లీతో ముగిసిన మ్యాచ్ లో ఓటమికి కారణం తిలక్ వర్మ అంటూ పాండ్యా తప్పును అతడిపై నెట్టేయడంతో.. హార్దిక్ పై మరింతగా నెగిటివిటీ పెరిగిపోయింది. మరి పాండ్యాపై ఏబీడీ చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.